హర్రర్ సినిమాలో నయనతార తో రొమాన్స్..!!

Divya
లేడీ సూపర్ స్టార్ గా పేరు పొందిన నయనతార వివాహం తర్వాత తన పిల్లల కారణాంగా సినిమాలకు బ్రేక్ ఇస్తోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో ఈ అమ్మడు సినిమాలతో బిజీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నయనతార చిత్రాలకు కమిట్ అవడం లేదని.. ఆవేదన వ్యక్తం చేస్తున్న అభిమానుల కోసం అన్నట్లుగా తాజాగా ఒక విషయం వైరల్ గా మారుతోంది. కొత్తగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. రత్న కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఒక చిత్రంలో హీరోగా లారెన్స్ నటిస్తూ ఉన్నారు.

ఇక ఈ చిత్రంలో నయనతార కూడా హీరోయిన్గా నటించబోతున్నట్లు తమిళ మీడియా వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి.. లారెన్స్ మరియు నయనతార కలిసి నటించేది మొదటి సారి అయిన కూడా ఈ సినిమా పైన భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ఇద్దరికీ కూడా హర్రర్  సినిమాలలో నటించి మంచి అనుభవం కలదు. ఇద్దరు కలిసి హర్రర్ సినిమా లో  నటిస్తే.. ఈ సినిమా ఖచ్చితంగా కలెక్షన్లు సునామీ సృష్టించడం ఖాయమంటూ అభిమానులు తెలియజేస్తున్నారు. అలాంటి ఈ క్రేజీ కాంబినేషన్లో సినిమా కోసం ఇప్పటినుంచి తెలుగు ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు

అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఈ సినిమా ఉండబోతున్నట్లు డైరెక్టర్ రత్నకుమార్ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది వచ్చిన తమిళ ఇండస్ట్రీ హిట్ మూవీ విక్రం కి రచన సహకారం అందించింది ఈ రత్న కుమార్. ప్రస్తుతం విజయ్ దళపతి హీరోగా నటిస్తున్న లియోకు కూడా రచన సహకారం అందిస్తున్నారు. లోకేష్ కనకరాజుకు స్నేహితుడిగా పేరున ఈ రత్నకుమార్ కచ్చితంగా హర్రర్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అవుతారేమో చూడాలి మరి. నయనతార లారెన్స్ కాంబినేషన్లో ఈ సినిమాకు సంబంధించి మరికొన్ని విషయాలు త్వరలోనే చిత్ర బృందం వెల్లడించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. రాబోయే రెండు నెలల్లో నయనతార మరో రెండు సినిమాలకు కమిట్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: