కరణ్ జోహార్ ఆఫీస్ లో ప్రత్యక్షమైన పూరీ జగన్నాథ్.. అందుకోసమేనా..?

Anilkumar
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది అగ్ర దర్శకులు ఉన్నారు. వారిలో ప్రస్తుతం కొంతమంది అగ్ర దర్శకులు వరుస ప్లాపులతో సతమతమవుతున్నారు. వారిలో మొదటగా చెప్పుకుంటే కొరటాల శివ ఇటీవల ఆచార్యతో భారీ డిజాస్టర్ అందుకున్నాడు. ఆ తర్వాత మన పూరి జగన్నా లైగర్ సినిమాతో అతిపెద్ద ప్లాప్ అందుకున్నాడు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలై బాక్సాఫీస్ వద్ద మొదటి రోజే భారీ పరాభవాన్ని ఎదుర్కొంది. ఇక ఈ సినిమాతో భారీ నష్టాలు అందుకున్న పూరీ జగన్నాథ్.. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి కోసం ఒక స్క్రిప్ట్ రెడీ చేసినట్టు తెలుస్తోంది. రామ్ చరణ్ కోసం కూడా ఓ కథ రాసుకున్నాడు కానీ అవి రెండు వర్కౌట్ అవ్వలేదు. 

అయితే ఇప్పుడు పూరీ జగన్నాథ్, ఛార్మి ఇద్దరు కలిసి ముంబై ఎయిర్పోర్టులో బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ఆఫీస్ కి వెళ్తూ కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అయితే పూరీ జగన్నాథ్, చార్మి ఇద్దరు కరణ్ జోహార్ ఆఫీస్ లో ప్రత్యక్షమవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిజానికి లైగర్ సినిమాను హిందీలో రిలీజ్ చేసింది బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహారే. అయితే ఈ సినిమా భారీ నష్టాలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే కదా. ఈ సినిమా ఫైనాన్స్ కు సంబంధించి సెటిల్మెంట్ గురించి మాట్లాడడానికి పూరి జగన్నాథ్, చార్మి తాజాగా కరణ్ జోహార్ ఆఫీస్ కి వెళ్ళారని కొంతమంది చెబుతున్నారు. మరికొందరు మాత్రం ఈ ముగ్గురు కలిసి మరోసారి ఓ సినిమా

 ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. గతంలో రామ్ తో ఇస్మార్ట్ శంకర్ సినిమాని పూరి జగన్నాథ్ తీయగా.. అదే సినిమాని బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ శ్రాఫ్ తో 'స్క్రుడిలా' అనే టైటిల్ తో రీమేక్ చేయాలని అనుకున్నారు. కానీ ఆ సినిమా క్యాన్సిల్ అయింది. మరోవైపు పూరి జగన్నాథ్ ఇప్పుడు ఒక బాలీవుడ్ హీరో తో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పూరి జగన్నాథ్ ఇప్పుడు కరన్ జోహార్ ఆఫీస్ దగ్గర కనిపించడంతో టాలీవుడ్ హీరోలు ఎవరు ఛాన్స్ ఇవ్వకపోవడంతో పూరి జగన్నాథ్ ఇప్పుడు బాలీవుడ్ హీరో తో సినిమా చేస్తున్నాడని.. అందుకే తాజాగా కరణ్ జోహార్ ఆఫీస్ కి వెళ్లి అతని కలిశాడని సోషల్ మీడియాలో పుకార్లు వినిపిస్తున్నాయి. మరి వీరి కలయిక ఎందుకోసం అనేది తెలియాలంటే దీనిపై పూర్తి స్పష్టత వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: