మార్చి 30వ తేదీన థియేటర్లలో విడుదల కాబోయే సినిమాలు ఇవే..!

Pulgam Srinivas
ప్రతి సంవత్సరం ఎన్నో సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి. అందులో కొన్ని తేదీ లలో అనేక సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల అవుతుంటాయి. అలాగే ఈ సంవత్సరం మార్చి 30 వ తేదీన కూడా అనేక క్రేజీ మూవీ లు థియేటర్ లలో విడుదల కావడానికి సిద్ధంగా ఉన్నాయి. అవి ఏ సినిమాలు ... ఏ భాషలో విడుదల కాబోతున్నాయో మనం తెలుసుకుందాం.
దసరా : ఈ మూవీ లో నాచురల్ స్టార్ నాని హీరో గా నటించిన కీర్తి సురేష్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు. ఈ మూవీ ని మార్చి 30వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ  , మలయాళ హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ మూవీ పై దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మరి ఈ మూవీ ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటుందో తెలియాలి అంటే మార్చి 30 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.
విడుతలై : ఈ మూవీ లో విజయ్ సేతుపతి హీరోగా నటించారు. ఈ మూవీ మార్చి 30 వ తేదీన తమిళ భాషలో విడుదల కాబోతుంది. ఈ మూవీ పై తమిళ సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.
పతు తల : ఈ తమిళ మూవీ మార్చ్ 30 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతోంది. ఈ మూవీ పై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.
హొయ్ సల : ఈ కన్నడ మూవీ మార్చి 30 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతుంది. ఈ మూవీ పై కన్నడ సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.
భోళా : అజయ్ దేవగన్ హీరో గా రూపొందిన ఈ హిందీ సినిమా మార్చి 30 వ తేదీన విడుదల కాబోతోంది. ఈ మూవీ పై హిందీ సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ మూవీ ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: