ఆ స్టార్ హీరోయిన్ కాళ్ళు పట్టుకున్న వెంకటేష్.. అందుకేనా..!?

Anilkumar
దగ్గుబాటి రామానాయుడు వారసుడిగా తెలుగు సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు వెంకటేష్. కలియుగ పాండవులు అనే సినిమాతో మొదటిసారిగా హీరోగా పరిచయమయ్యాడు వెంకటేష్. నటించిన మొదటి సినిమాని బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో హీరోగా మంచి గుర్తింపును పొందాడు వెంకటేష్. దాని అనంతరం ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి స్టార్ హీరోగా ఎదిగాడు. అలా బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించిన వెంకటేష్ ఎక్కువగా రీమిక్స్ సినిమాల్లో కూడా నటించి మెప్పించాడు. వెంకటేష్ కి ఆరుపదుల వైయస్ దాటినప్పటికీ ఇప్పటికీ కూడా కుర్ర హీరోల లాగా వయసు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. 

నటన మాత్రమే కాకుండా ఫైట్ సీన్లు మరియు కామెడీ సన్నివేశాలు రొమాంటిక్ సన్నివేశాలు కూడా అద్భుతంగా నటిస్తాడు వెంకటేష్ .ఇటీవల కాలంలో ఆయన నటించిన ఎఫ్3 సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమానే కాకుండా తాజాగా రానా తో కలిసి రానా నాయుడు అనే వెబ్ సిరీస్ లో కూడా నటించాడు వెంకటేష్. ఇదిలా ఉంటే ఇక గతంలో వెంకటేష్ కి సౌందర్య కి మధ్య ఎఫైర్ ఉంది అన్నా వార్తలు కూడా వచ్చాయి. వీరిద్దరూ కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. అందుకే వీరిద్దరి మధ్య ఎఫైర్ ఉంది అంటూ రకరకాల వార్తలను స్ప్రెడ్ చేశారు. కానీ అలా వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదు అంటూ ఎన్నోసార్లు వారిద్దరూ క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది.

 అయితే గతంలో జరిగిన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు వెంకటేష్. ఇంటర్వ్యూలో భాగంగా వారిద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. వెంకటేష్ తో కలిసి సౌందర్య పవిత్ర బంధం అనే సినిమాలో నటించిన సంగతి మనందరికీ తెలిసిందే .ఇక ఆ సమయంలో సౌందర్య కాళ్లు వెంకటేష్ పట్టుకుంటాడు. ఇక దానికి సంబంధించిన ఒక పోస్టర్ని చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఈ క్రమంలోనే ఇలాంటి సన్నివేశాలు సినిమాల్లో ఉంటే కచ్చితంగా ఎవరూ చూడరు అని వెంకటేష్ ని అందరూ అన్నారట .కానీ కథ బాగుండడం వల్ల ఎలాంటి సినిమా అయినా హిట్ అవుతుంది అని వెంకటేష్ చాలా బలంగా నమ్మారు.ఈక్  సినిమా విడుదలైన తర్వాత వెంకటేష్  సౌందర్య కాళ్లు పట్టుకున్న సేమ్ ఎంతలా హైలైట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: