ఓటీటీలో సందడి చేయనున్న రైటర్ పద్మభూషణ్..!

Divya

హీరో సుహాస్ కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం రైటర్ పద్మభూషణ్.. సుహాస్ జంటగా షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఫిబ్రవరి 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తో దూసుకుపోయింది. అంతేకాదు ఫీల్ గుడ్ మూవీ గా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకోవడంతో చాలామంది థియేటర్లలో చూడలేని అభిమానులు ఓటీటీ కోసం ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా ఓటిటి వేదికగా స్ట్రీమింగ్ అవ్వడానికి సిద్ధమైందని తెలుస్తోంది.

రైటర్ పద్మభూషణ్ ఓటీటీ రైట్స్ ను Zee5 దక్కించుకున్న విషయం అందరికీ తెలిసిందే.  ఈ క్రమంలోనే మార్చి 17వ తేదీ నుంచి ఈ సినిమా Zee5 వేదికగా స్ట్రీమింగ్ కానుంది.. ఇక ఈ రైటర్ పద్మభూషణ్ కథ విషయానికి వస్తే.. భూషణ్ విజయవాడకు చెందిన ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి.. ఒక గ్రంథాలయంలో అసిస్టెంట్ లైబ్రరీయన్ గా పనిచేస్తూ ఉంటాడు.  ఎప్పటికైనా రైటర్ పద్మభూషణ్ అనిపించుకోవాలని ఆయన కల.. ఇంట్లో వాళ్లకు కూడా తెలియకుండా లక్షలు అప్పు చేసి మరీ తొలి అడుగు పేరుతో ఒక బుక్కు రాస్తారు అయితే పాఠకులతో ఆ బుక్ ని చదివించడానికి పడరాన్ని పాట్లు పడుతూ ఉంటాడు..
అప్పులు కట్టలేక ఇంటికి తిరిగి వచ్చిన ఈయన అదే సమయంలో మరో కొత్త పుస్తకానికి అదే పేరుతో ఏర్పాటైన బ్లాగుకు మంచి పేరు రావడం జరుగుతుంది..ఇక ఎప్పుడో దూరమైన తన మేనమామ తనకు పిల్లను ఇవ్వడానికి వస్తే తన తల్లిదండ్రులకు ఊహించని సంతోషాన్ని కలిగిస్తుంది.  ఇంతలోనే ఆ బ్లాగులో వరుసగా వస్తున్న కంటెంట్ కూడా ఆగిపోతుంది.  దాంతో అసలు విషయాన్నీ తనకు కాబోయే భార్యకి చెప్పాలనుకున్న భూషణ్ అలా చెప్పాడా?  లేదా?  అసలు వీరిద్దరి పెళ్లి జరిగిందా? లేదా? అనేది ఈ సినిమా కథాంశం. మొత్తానికైతే ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మరి ఓటీటీ లో ఏ విధంగా అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: