రావణాసుర సినిమాలో రవితేజ హీరోనా..? విలనా ..!?

Anilkumar
కెరియర్ ప్రారంభంలో ప్రతి నాయకుడిగా నటించిన మాస్ మహారాజ రవితేజ ఇన్నాళ్ల తర్వాత మళ్లీ తనలోని విలనిజంని బయటపెట్టారా..? రావణాసుర సినిమాలో రవితేజ అసలు హీరోనా.. విలనా..? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా రావణాసుర సినిమాకి సంబంధించి టీజర్ అందరిని కన్ఫ్యూజన్లోకి నెట్టేస్తుంది. ఇటీవల మాస్ మహారాజా రవితేజ నటించిన ధమాకా వాల్తేరు వీరయ్య సినిమాలతో వరుసగా రెండు విజయాలను అందుకున్నాడు మాస్ మహారాజా రవితేజ. ఇలా రెండు వరస విజయాలు వచ్చేసరికి రవితేజలో మార్పు వచ్చిందని అంటున్నారు చాలామంది నెటిజన్స్. ఏదో చేద్దాం అని అనుకోకుండా బాక్స్ ఆఫీస్ ని కచ్చితంగా బద్దలు కొట్టాలి అన్న ప్లాన్ లో ఉన్నాడు మాస్ మహారాజ రవితేజ.

ఇకముందు రవితేజ నుండి వచ్చే సినిమాలన్నీ చాలా విభిన్నంగా ఉంటాయని తెలుస్తోంది .ఇక అందులో ముందుగా మాత్రం రావణాసుర సినిమా ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన ఈ సినిమా ఏప్రిల్ 7న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు చిత్ర బృందం .సుధీర్ వర్మ తెరకెక్కిస్తున్న  ఈ సినిమాపై రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. 2003 తర్వాత ఒక హ్యాట్రిక్ కూడా కొట్టని రవితేజ సుధీర్ వర్మతో వరుసగా మూడో విజయం అందుకోవాలని ప్లాన్ లో ఉన్నాడు రవితేజ.

ఇప్పటికి ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ను పూర్తి చేసుకొని తన తదుపరి సినిమాలకు సంబంధించిన షూటింగ్లో బిజీగా ఉన్నాడు రవితేజ. అయితే ఈ సినిమాలో రవితేజ నెగటివ్ రోల్ లో కనిపిస్తాడా అన్న అనుమానాలు ఎక్కువ అవుతున్నాయి. ఇకపోతే ధమాకా సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా సక్సెస్ తరువాత దీని బిజినెస్ కూడా భారీగా పెరిగింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కెరియర్ ప్రారంభంలో రవితేజ విలన్ గా నటించడం జరిగింది.అనంతరం హీరో అయిన తర్వాత ప్రతి నాయకుడిగా ఒక సినిమాలో కూడా కనిపించలేదు. ఈ మధ్య ఎన్టీఆర్ కళ్యాణ్రామ్ సహా చాలా మంది హీరోలు నెగిటివ్ రోల్ లో కనిపించారు. ఇక మన మాస్ మహారాజా కూడా అదే దారిలో వెళుతున్నారా అన్నది చూడాలి. రావణాసుర సినిమాలో అసలు రవితేజ పాత్ర ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు అందరిలో ఆసక్తికరంగా మారింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: