సినిమాల ద్వారా సంపాదించిన డబ్బును చంద్రమోహన్ ఏం చేసాడో తెలుసా..!?

Anilkumar
ఒకప్పుడు హీరోగా మంచి గుర్తింపును తెచ్చుకున్న హీరోలలో చంద్రమోహన్ కూడా ఒకరు .ఇండస్ట్రీలో చంద్ర మోహన్, శోభన్ బాబు ఇద్దరు కూడా మంచి స్నేహితులు అన్న విషయం చాలామందికి తెలిసే ఉంటుంది .వీరిద్దరూ కలిసి చాలా సినిమాలలో నటించారు కూడా .అంతేకాదు సోలో హీరోగా చంద్రమోహన్ చాలా సినిమాలలోని నటించారు ఎంతోమంది స్టార్ హీరోయిన్లతో నటించి లక్కీ హీరోగా కూడా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ముఖ్యంగా చెప్పాలి అంటే చంద్రమోహన్ తో కనీసం ఒక్క సినిమాలో అన్నా నటించే అవకాశం వస్తే బాగుంటుంది అని చాలామంది హీరోయిన్లు ఎదురుచూసేవారు. ఆయనతో కలిసి కనీసం ఒక్క సినిమాలో అయినా నటిస్తే చాలు హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంటాం అన్న నమ్మకంతో చాలామంది ఎదురు చూశారు .అలా అందాల తార శ్రీదేవి నుండి మొదలుపెడితే జయసుధ వరకు చాలామంది..

తమ మొదటి సినిమాని చంద్రమోహన్ తోనే కలిసి నటించి స్టార్ హీరోయిన్లుగా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు .ఇక ఈయన నటన విషయానికి వస్తే ఎంత అద్భుతంగా నటిస్తారో మనందరికీ తెలిసిందే ఎమోషనల్ సీన్స్ చేయడం లో ఈయన సిద్ధహస్తుడు అని చెప్పాలి. ఆయన చేసిన ప్రతి సీను కూడా చాలా అద్భుతంగా ఉంటుంది .ఎమోషనల్ తో పాటు కామెడీ కూడా అద్భుతంగా చేస్తారో చంద్రమోహన్ కృష్ణవంశీ సినిమాల్లో చూస్తే చంద్రమోహన్ కామెడీ ఎంత అద్భుతంగా ఉంటుందో అర్థమవుతుంది. ఇదిలా ఉంటే కృష్ణవంశీ సినిమాలలో ఆయన నటించిన పాత్రలకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది .చాలా సినిమాల్లో ఈయన తండ్రిగా హీరోగా నటించారు.

సినిమాల్లోనే కాకుండా తన నిజ జీవితంలో మాత్రం తండ్రి అని చంద్రమోహన్లా ఉంటే ఎంతో బాగుంటుంది అని చాలామంది అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇకపోతే సినిమాల ద్వారా సంపాదించిన డబ్బులు మొత్తం కూడా ఆయన లైన్స్ పైనే ఇన్వెస్ట్ చేసేవారట. దాంతో ఇప్పుడు వాటి విలువ కొన్ని కోట్లలో ఉంది. అందుకే ఆయన్ని సినీ ఇండస్ట్రీలో కుబేరుడు అని కూడా చాలామంది అంటూ ఉంటారు. ప్రస్తుతం ఆయనకి సినిమాల్లో అవకాశాలు వస్తున్నప్పటికీ ఆ సినిమాల్లో నటించడానికి ఒప్పుకోవడం లేదు చంద్రమోహన్. ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోగా ఉన్న ఈయన తన వారసులను మాత్రం ఇండస్ట్రీలోకి ఇప్పటిదాకా తీసుకురాలేదు. ఏదేమైనప్పటికీ చంద్రమోహన్ లాంటి మంచి నటులు మళ్లీ సినిమాల్లో కనిపిస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు ఆయన అభిమానులు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: