"దసరా" మూవీ అన్ని భాషల ట్రైలర్లు అక్కడి నుండి విడుదల..?

Pulgam Srinivas
నాచురల్ స్టార్ నాని పోయిన సంవత్సరం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన అంటే సుందరానికి అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మంచి అంచనాలు నడుమ విడుదల అయిన ఈ మూవీ ప్రేక్షకులను అనుకొన్నంత రేంజ్ లో అలరించ లేక పోయింది. అలా అంటే సుందరానికి మూవీ తో ప్రేక్షకులను కాస్త నిరుత్సాహ పరిచిన నాని ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న దసరా అనే పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. 

ఈ మూవీ లో నాని పక్క ఊర మాస్ లుక్ లో కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ని మార్చి 30 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం రెండు పాటలను విడుదల చేసింది. అలాగే కొన్ని ప్రచార చిత్రాలను కూడా విడుదల చేసింది. వీటికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. ఈ మూవీ కి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.

ఇలా ఉంటే ఈ మూవీ ని మార్చి 30 వ తేదీన తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. అందులో భాగంగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ప్రచారాలను కూడా మరి కొన్ని రోజుల్లో మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ మూవీ ట్రైలర్ విడుదలకు సంబంధించి ఈ మూవీ యూనిట్ ఒక ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి సంబంధించిన అన్ని భాషల ట్రైలర్ లను లక్నో నుండి విడుదల చేసే విధంగా ఈ మూవీ యూనిట్ సన్నహాలను చేస్తున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: