అఖిల్ "ఏజెంట్" మూవీ నుండి మరో సాంగ్ విడుదల అప్పుడే..?

Pulgam Srinivas
అక్కినేని అఖిల్ ప్రస్తుతం ఏజెంట్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ లో సాక్షి వైద్య అఖిల్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ముద్దు గుమ్మ ఈ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. హిప్ హాప్ తమీజ సంగీతం అందిస్తున్న ఈ మూవీ లో మమ్ముట్టి ఒక కీలకమైన పాత్రలో కనిపించ బోతున్నాడు. ఈ మూవీ ని తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ , తమిళ్ భాషల్లో ఒకే సారి విడుదల చేయనున్నారు.

ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి అదిరి పోయే రేంజ్ రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ఒక పాట మినహా మొత్తం పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో మొత్తం మూడు పాటలు మరియు ఒక మ్యూజిక్ బీట్ ఉండబోతున్నట్లు సమాచారం. ఒక లాస్ట్ సాంగ్ చిత్రీకరణ పెండింగ్ లో ఉన్నట్లు ... ఈ సాంగ్ చిత్రీకరణ ను కూడా మరి కొద్ది రోజుల్లోనే ఈ మూవీ యూనిట్ పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం ఒక పాటను విడుదల చేసిన విషయం మన అందరికీ తెలిసిందే.

ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ నుండి మరో పాటను వచ్చే వారం విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ యూనిట్ ఉన్నట్లు ... అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరి కొన్ని రోజుల్లో రాబోతున్నట్లు తెలుస్తోంది. అఖిల్ నటిస్తున్న మొట్ట మొదటి పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ మూవీ పై అక్కినేని అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: