వెబ్ సిరీస్ లో నటించనున్న బాలయ్య.. ఇక ఓటీటీలు దద్దరిల్లాల్సిందే..!!

Anilkumar
టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ అఖండ, వీరసింహారెడ్డి వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ప్రస్తుతం తన తదుపరిచిత్రాన్ని అనిల్ రావిపూడి డైరెక్షన్లో చేస్తున్నాడు.NBK108 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. వెండితెరపై నే కాదు అటు బుల్లితెరపై కూడా అన్స్టాపబుల్ అనే షో ద్వారా బాలయ్య భారీ క్రేజ్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ షో తో బాలయ్య మీద ఉన్న నెగెటివిటీ కూడా తొలగిపోయింది. ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహా లో ప్రసారమైన ఈ టాక్ షో బాలయ్యకు ఫుల్ పాపులారిటీని తెచ్చిపెట్టింది. టిఆర్పి రేటింగ్స్ లో కూడా ఇండియాలోనే నెంబర్ వన్ షోగా నిలిచింది. 

ఇప్పటికే అన్ స్టాపబుల్ షోకు సంబంధించి రెండు సీజన్లు విజయవంతంగా పూర్తయ్యాయి. ఇదిలా ఉంటే ఓటీటీలో అన్ స్టాపబుల్ టాక్ షో తో సక్సెస్ అవడంతో ఈ టాక్షో నిర్మత అల్లు అరవింద్ ఇప్పుడు బాలయ్య తో ఓ వెబ్ సిరీస్ చేస్తే బాగుంటుందని భావిస్తున్నాడట. ఈ క్రమంలోనే ఈ విషయంపై ఇప్పటికే బాలయ్యతో చర్చలు జరుగుతున్నట్లు ఫిలిం సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చర్చలు కనుక సఫలం అయితే బాలకృష్ణ త్వరలోనే ఓ వెబ్ సిరీస్ లో నటించే అవకాశం ఉందని అంటున్నారు. ఇటీవల కాలంలో సినీ తారలంతా ఓటీటీల బాట పడుతున్నారు. ఇప్పటికే సీనియర్ హీరోల్లో వెంకటేష్ దగ్గుపాటి రానా తో కలిసి 'రానా నాయుడు' అనే వెబ్ సిరీస్ లో నటించాడు.

నెట్ ఫ్లిక్స్ లో త్వరలో ఇది స్ట్రీమింగ్ కానుంది. అటు సమంత లాంటి స్టార్ హీరోయిన్స్ కూడా ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ చేయగా.. ఇప్పుడు సిడాటెల్ అనే మరో వెబ్ సిరీస్ రాబోతుంది. హీరోయిన్ అంజలి ఇప్పటికే పలు వెబ్ సిరీస్ లో నటించింది. నాగచైతన్య కూడా ఓ వెబ్ సిరిస్ తో రాబోతున్నాడు. లావణ్య త్రిపాఠి, విజయ్ సేతుపతి, ఆది సాయికుమార్ లాంటి సినీ తారలు కూడా ఇప్పటికే ఓటీటీలో మెరిసారు. ఇప్పుడు బాలయ్య కూడా ఓటిటిలో వెబ్ సిరీస్ చేస్తే నందమూరి అభిమానులకు పండగే అని చెప్పొచ్చు. ఇన్నాళ్లు డిజిటల్ ప్లాట్ ఫామ్ లో కేవలం ఒక టాక్ షో తో సందడి చేసిన బాలయ్య.. ఇప్పుడు వెబ్ సిరీస్ తో సందడి చేయనుండటం విశేషం అనే చెప్పాలి. ఇక త్వరలోనే ఈ వెబ్ సిరీస్ కి సంబంధించి పూర్తి వివరాలను ఆహ నిర్మాత అల్లు అరవింద్ వెల్లడించే అవకాశం ఉంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: