ఒక్క రోజుకి 25 లక్షల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్న యంగ్ హీరో..?

Anilkumar
తెలుగు సినీ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంతో మంది అగ్ర హీరోల సినిమాలో నటించిన తేజ సజ్జ.. సమంత ప్రధాన పాత్ర పోషించిన 'ఓ బేబీ' అనే సినిమాతో నటుడిగా తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. ఆ తర్వాత 'జాంబిరెడ్డి' అనే సినిమాతో హీరోగా మారి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆ తర్వాత అద్భుతం అనే సినిమాలో నటించి ఆ సినిమాతో కూడా సూపర్ హిట్ అందుకున్నాడు. దీంతో ప్రస్తుతం తేజ సబ్జా కి టాలీవుడ్ లో మంచి క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం 'హనుమాన్' అనే సినిమా చేస్తున్నాడు ఈ యంగ్ హీరో. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. 

తెలుగులోనే మొట్టమొదటి సూపర్ హీరో కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందుతుండగా.. సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. డిఫరెంట్ జోనర్స్ ఎంచుకునే యంగ్ హీరో తేజ సజ్జాకి ఈ హనుమాన్ మూవీ కచ్చితంగా స్టార్ స్టేటస్ ను అందిస్తుందని భావిస్తున్నారు సినీ విశ్లేషకులు. ఇక ప్రస్తుతం ఈ యంగ్ హీరోకి మంచి సినిమా ఆఫర్లు కూడా వస్తున్నాయి. ఒకవైపు వరస సినిమాల్లో నటిస్తూనే మరోవైపు బ్రాండ్ ఎండార్మెంట్స్ తో చాలా బిజీ బిజీగా గడుపుతున్నాడు. అయితే ఈమధ్య ఒక భారీ బడ్జెట్ యాడ్లో నటించిన తేజ.. ఈ యాడ్ కి ఏకంగా పాతిక లక్షలు రెమ్యూనరేషన్ అది కూడా ఒక్కరోజు షూటింగ్ లో పాల్గొన్నందుకు తీసుకున్నట్లు సమాచారం.

కేవలం ఒక్క రోజుకే 25 లక్షల తీసుకోవడం అంటే అది మామూలు విషయం కాదు. దీంతో ప్రస్తుతం ఈ యంగ్ హీరో రెమ్యూనరేషన్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే హైదరాబాదులో ఇప్పటికే తేజ ఎన్నో షాపులను ఓపెన్ చేశాడు. ఇక ఇప్పుడు హీరోగా ఎంతో బిజీ అయిన యాడ్స్ లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. ఇక తేజ సజ్జ నటిస్తున్న హనుమాన్ విషయానికొస్తే.. ఈ సినిమాలో అతీంద్రియ శక్తులు కలిగిన పాత్రలో తేజ నటిస్తుండగా.. తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఓ కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాని  త్వరలోనే విడుదల చేసేందుకు మేకర్ సన్నాహాలు చేస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: