రావణాసుర కు బెంగాలి స్ఫూర్తి !

Seetha Sailaja
‘ధమాకా’ బ్లాక్ బష్టర్ కావడంతో రవితేజా మళ్ళీ ట్రాక్ లోకి వచ్చేసాడు. ఈ సంవత్సరం సమ్మర్ రేస్ ను టార్గెట్ చేస్తూ ఏప్రియల్ లో విడుదల కాబోతున్న రావణాసుర మూవీకి సంబంధించి ఒక ఆసక్తికర లీక్ ఇప్పుడు బయటకు వచ్చింది. తెలుస్తున్న సమాచారంమేరకు ఈమూవీలో రవితేజా డ్యూయల్ రోల్ చేస్తున్నాడు.

ఆ రెండు పాత్రలలో ఒక పాత్రకు పూర్తి నెగిటివ్ షెడ్ ఉంటుందట. ప్రోస్తటిక్స్ వాడి ఇతర మనుషుల మొహాలను పెట్టుకుని క్రైమ్ చేసే పాత్రలో రవితేజాను చాల డిఫరెంట్ గా దర్శకుడు సుధీర్ వర్మ చూపించబోతున్నట్లు లీకులు వస్తున్నాయి. 2019 బెంగాలీలో వచ్చిన ‘విన్సీడా’ మూవీ లైన్ నుంచి స్ఫూర్తి తీసుకుని సుధీర్ వర్మ ఈకథను అల్లాడు అని అంటున్నారు.

ఈమూవీలో అక్కినేని నాగార్జున మేనల్లుడు సుశాంత్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈపాత్ర రవితేజ పాత్రతో సరిసమానంగా ఉంటుంది అని అంటున్నారు. ‘అల వైకుంఠ పురములో’ మూవీలో సుశాంత్ కు కీలక పాత్ర దక్కినప్పటికీ ఆమూవీ సూపర్ సక్సస్ వల్ల అతడికి కెరియర్ పరంగా ఏమాత్రం కలిసి రాలేదు. కనీసం ఈమూవీతో అయినా సుశాంత్ కు కెరియర్ బ్రేక్ లభిస్తుందేమో చూడాలి. ఇప్పటికే ఈసినిమాకు సంబంధించిన టైటిల్ తో పాటు లిరికల్ సాంగ్స్ కు మంచి స్పందన రావడమే కాకుండా చార్ట్ బస్టర్ గా పరుగులు పెడుతున్నాయి.

ఈమూవీ తరువాత రవితేజా నుండి ‘ఈగల్’ ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలు రాబోతున్నాయి సంవత్సరానికి మూడు సినిమాలు రిలీజ్ లక్ష్యంగా రవితేజ తీస్తున్న పరుగులు టాప్ హీరోలకు కూడ షాక్ ఇస్తున్నాయి. ‘ధమాకా’ సూపర్ సక్సస్ తరువాత మాస్ మహారాజ తన పారితోషికాన్ని 25 కోట్ల స్థాయికి తీసుకు వెళ్లిపోవడంతో ప్రస్తుతం రవితేజా తో సినిమా తీయాలి అంటే ఆ నిర్మాతలకు 60 కోట్ల పెట్టుబడి అవసరం ఉంది అని అంటున్నారు. ‘రావణాసుర’ సినిమా కూడ హిట్ అయితే రవితేజా రేంజ్ ఏస్థాయికి వెళుతుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: