శ్రీలీల కున్న ఆ బెన్ఫిట్ ప్రతి సినిమాలో వర్కౌట్ అయ్యేనా..?

Divya
టాలీవుడ్ లో ఎక్కువగా ఇప్పుడు వినిపిస్తున్న పేరు ఏమిటంటే శ్రీ లీల. డైరెక్టర్ రాఘవేంద్రరావు పర్యవేక్షణలో నటుడు శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా నటించిన.. పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది కన్నడ ముద్దుగుమ్మ శ్రీ లీల. తన మొదటి సినిమాతోని మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత రవితేజతో కలిసి ధమాకా చిత్రంలో నటించింది. ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకోవడంతో ఈమె పేరు మరింత పాపులారిటీ అయింది. దీంతో ఇప్పుడు ఏకంగా మహేష్ బాబు సినిమాలో నటించే అవకాశాన్ని అందుకుంది.
ఈమె ఎక్కువగా తన డాన్స్ తో అందరిని ఆకట్టుకుంది. ముఖ్యంగా తనదైన స్టైల్ లో శ్రీ లీల పవర్ బ్యాక్ స్టెప్పులతో ప్రత్యేకంగా ఆకర్షణీయంగా నిలుస్తోంది. తను నటించిన చిత్రాలలో కూడా డాన్స్ తోనే మంచి క్రేజీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ బాలకృష్ణ, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాబోతున్న చిత్రంలో ఈమె బాలయ్య కూతురుగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక అలాగే మహేష్ తో పాటు హీరో రామ్ ,బోయపాటి కాంబినేషన్లో వస్తున్న పాన్ ఇండియా చిత్రంలో కూడా నటిస్తున్నట్లు సమాచారం.

అలాగే పంజా వైష్ణవి చేసిన నాలుగో ప్రాజెక్టులో కూడా ఈమె హీరోయిన్గా ఎంపికైనట్లు తెలుస్తోంది. నితిన్ నటిస్తున్న అనగనగా ఒక రాజు చిత్రంలో కూడా ఈమె హీరోయిన్గా నటిస్తున్నట్లు సమాచారం. ఇక ఇవే కాకుండా పలు క్రేజీ ప్రాజెక్టులలో టాలీవుడ్ లో భారీ ఇంఫాక్ట్ ని క్రియేట్ చేసుకుంది శ్రీ లీల. శ్రీ లీలాకు ఉన్న టాలెంట్ డాన్స్ ఈ డాన్స్ తో ప్రతి సినిమాలో కూడా తన మార్కుని క్రియేట్ చేసుకోవడం చాలా కష్టమని చెప్పవచ్చు ఒకవేళ ఈ సినిమాలలో అదిరిపోయే సాంగ్స్ ఉంటే తప్ప శ్రీల మ్యాజిక్ వర్కౌట్ కావడం కష్టమని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈమెకు ఉన్న ఈ బెనిఫిట్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: