వారసుడు వసూళ్ళని 10 రోజుల్లో దాటేసిన సార్?

Purushottham Vinay
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తలపతి విజయ్ హీరోగా తెరకెక్కిన వారసుడు సినిమా తెలుగులో పర్వాలేదు అనిపించేలా కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాకి మహర్షి దర్శకుడు వంశీ పైడిపల్లి కావడం... ఏకంగా బడా నిర్మాత దిల్ రాజు కావడంతో ఈ సినిమా మీద ప్రేక్షకులు విపరీతమైన బాగానే అంచనాలు వేశారు. ఫైనల్ గా తెలుగులో దిల్ రాజు అమ్మిన ఎమౌంట్ కంటే కొంచెం ఎక్కువ రావడంతో తెలుగులో కూడా విజయ్ హిట్టు కొట్టినట్లు అయింది.ఇంకా అంతేగాక తెలుగులో విజయ్ కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ నమోదు చేసిన సినిమాగా కూడా ఈ సినిమా నిలిచింది. అయితే ఇంత భారీ విజయాన్ని సాధించిన సినిమాని ఏమాత్రం అంచనాల లేకుండా ఆడియన్స్ ముందుకు వచ్చిన ధనుష్ సార్ మూవీ చాలా ఈజీగా దాటేసింది.వినడానికి ఇది ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజమే అని అంటున్నారు.


తెలుగులో సెన్సేషనల్ వసూళ్లతో అన్ సీజన్లో కూడా బాక్సాఫీసును మైమరిపిస్తూ ముందుకు వెళుతున్న సార్ సినిమా కేవలం 10 అంటే 10 రోజుల వ్యవధిలోనే విజయ్ హైయెస్ట్ కెరీర్ కలెక్షన్స్ ని చాలా ఈజీగా క్రాస్ చేసి ముందుకు వెళుతోంది. ఇక ఈ సినిమా వసూళ్ల విషయానికి వస్తే తన కెరియర్ లోనే తెలుగులో అత్యధిక కలెక్షన్స్ ని ధనుష్ చూస్తున్నాడు. అసలు ఈ రేంజ్ వసూళ్లని ధనుష్ కూడా ఊహించి ఉండడు.విజయ్ వారసుడు సినిమా టోటల్ రన్ లో మొత్తం 15 కోట్ల ఐదు లక్షల షేర్ ఇంకా 27 కోట్ల గ్రాస్ అందుకోగా పది రోజులలోనే ధనుష్ హీరోగా నటించిన సార్ మూవీ 16 కోట్ల లక్షల షేర్ ఇంకా 30 కోట్ల గ్రాస్ అందుకుంది.అలా నేరుగా విజయ్ హైయెస్ట్ కలెక్షన్స్ ని తెలుగులో సునాయసంగా ధనుష్ క్రాస్ చేశాడు. మళ్లీ శుక్రవారం వరకు పెద్దగా సినిమాలు లేని నేపథ్యంలో ఈ వసూళ్లు ఇంకా ఎక్కువగానే నమోదయ్య అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: