బాలయ్య నిజ స్వరూపం బయటపెట్టిన హీరోయిన్ లయ..?

Anilkumar
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన వాళ్లలో హీరోయిన్ లయ ఒకరు. అచ్చ తెలుగు అమ్మాయి అయిన ఈ ముద్దుగుమ్మ ఎన్నో హిట్ సినిమాల్లో నటించి స్టార్ స్టేటస్ ను సంపాదించుకుంది. ఇక పెళ్లి తర్వాత లయ సినిమాలకు పూర్తిగా దూరమైంది.తన ఫ్యామిలీతో కలిసి అమెరికాలో సెటిల్ అయిపోయింది. తాజాగా ఇండియాకు వచ్చిన ఆమె..ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ముఖ్యంగా తన కెరీర్ కు సంబంధించి చాలా విషయాలను షేర్ చేసుకుంది. ఈ క్రమంలోనే మన బాలయ్య గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చేసింది. బాలయ్యతో కలిసి లయ 'విజయేంద్ర వర్మ' అనే సినిమా చేసింది. ఈ సినిమా చేస్తున్న సమయంలో ప్రతి ఒక్కరూ బాలకృష్ణ గారికి చాలా కోపం ఎక్కువని.. ఆయనతో చాలా జాగ్రత్తగా  మాట్లాడాలని చెప్పడంతో తనకు చాలా భయమేసింది అని తెలిపింది. 

కానీ అదంతా అవాస్తవమని చెప్పింది లయ. తాజా ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ..' బాలకృష్ణ గారిని దూరం నుంచి చూసిన వాళ్లు ఆయన చాలా కోపంగా ఉంటారు. ఆయనతో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఆయనకు బాగా రెస్పెక్ట్ ఇవ్వాలి. లేకపోతే కోపం వస్తుంది అని చెప్తూ ఉంటారు. నేను ఆయనని సార్ అని పిలిచే దాన్ని. తను ఎందుకు సార్ అంటారు? అలా అనకండి అని చెప్పేవారు. ఆయనది చిన్న పిల్లల మనస్తత్వం. ఆయన బిజీగా ఉంటే మాత్రం మాట్లాడరు. కానీ ఆయన మాట్లాడితే చాలా బాగుంటుంది. మనసులో ఉన్నది ఆయన బయటికి చెప్తారు. సెట్లో అందరితో చాలా సరదాగా ఉంటారు. ఆయనతో సినిమా అనగానే చాలామంది భయపడతారు. కానీ అదంతా అవాస్తవం' అంటూ చెప్పుకొచ్చింది లయ.

అంతేకాదు..' విజయేంద్ర వర్మ సినిమాకు సంబంధించి ముందు నేను బాల్య గారితో పాటు చేశాను. ఆ పాటకు సంబంధించి ప్రాక్టీస్ చేస్తున్నా. నేను ముందు తిరిగి ఉన్నాను. బాలయ్య వెనకాల ఉన్నారు. నాకు కనిపించలేదు. స్టెప్స్ నేర్చుకుంటూ నేను కాల్ వెనక్కి పెట్టాను. నా కాలుతో ఆయన కాల్ మీ తొక్కను. సారీ సార్.. సారీ సార్.. అని చెప్పాను. తొక్కేస్తావా నా కాలు? అని అటు ఇటు చూసి ప్యాకప్ అన్నారు. నేను కోపంతో అలా అన్నారనుకొని ఏడుస్తున్నాను. సారీ సార్.. సారీ సార్.. అంటే ఏడుస్తూనే ఉన్నాను. అయితే కాసేపు నన్ను ఏడిపించి ఇదంతా సరదాగా ఊరికే అన్నాను అంటూ నవ్వేశారు. చాలా టెన్షన్ పడ్డాను. కానీ బాలకృష్ణ గారు నవ్వడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను' అని బాలయ్య మనస్తత్వం గురించి తాజా ఇంటర్వ్యూలో పేర్కొంది లయ...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: