గ్లామర్ రోల్స్ చేయడానికైనా సిద్ధం అంటున్న స్టార్ నటి....!!

murali krishna
టాలీవుడ్ ఇండస్ట్రీలో హ్యట్రిక్ విజయాలతో దూసుకుపోతు తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్లలో సంయుక్త మీనన్ ఒకరు. ఆమె భీమ్లా నాయక్, బింబిసార, సార్ సినిమాలతో సంయుక్త మీనన్ హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకోగా ఈ విజయాలతో సంయుక్త మీనన్ కు డిమాండ్ పెరిగింది.
ఐతే ఆమె మరీ అద్భుతమైన నటి కాకపోయినా సంయుక్త మీనన్ కు వరుసగా కొత్త సినిమా ఆఫర్లు అయితే వస్తున్నాయి. దాంతో టాలీవుడ్ దర్శకనిర్మాతలు సంయుక్త మీనన్ కు వరుసగా సినిమా ఆఫర్లు ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తుండటం గమనార్హం. అయితే వరుస విజయాల నేపథ్యంలో రెమ్యునరేషన్ ను పెంచాలని సంయుక్త మీనన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఐతే కథ నచ్చితే సెకండ్ హీరోయిన్ రోల్స్ లో నటించడానికి సైతం సంయుక్త మీనన్ ఇంట్రెస్ట్ చూపించడం గమనార్హం. సార్ మూవీలో ఆమె టీచర్ రోల్ ను అద్భుతంగా పోషించి ఈ నటి మెప్పించారు.
ప్రెసెంట్ సంయుక్త మీనన్ ఒక్కో ప్రాజెక్ట్ కు డెబ్భై లక్షల రూపాయల నుంచి కోటి రూపాయల రేంజ్ లో డిమాండ్ చేస్తోందని బోగట్టా. ఐతే కథ నచ్చితే గ్లామర్ రోల్స్ లో నటించడానికి కూడా సంయుక్త మీనన్ సిద్ధంగా ఉంటారని తెలుస్తోంది. ఐతే ఇప్పటివరకు ఆమె అభినయ ప్రధాన పాత్రల్లో మాత్రమే సంయుక్త మీనన్ నటించడం గమనార్హం. తమిళంలో బూమరాంగ్ అనే సినిమాలో ఈ బ్యూటీ నటిస్తున్నారు. తెలుగులో స్టార్ హీరోలకు జోడీగా సంయుక్తకు ఛాన్స్ దక్కితే ఆమె కెరీర్ మరింత పుంజుకుంటుందని చెప్పవచ్చు. సంయుక్త మీనన్ కెరీర్ విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. వేగంగా ప్రాజెక్ట్ లను ఎంచుకోవడం కంటే క్రేజీ ప్రాజెక్ట్ లను ఎంచుకోవడంపై ఈ బ్యూటీ దృష్టి పెడుతున్నారు అని సమాచారం. సంయుక్త మీనన్ కెరీర్ పరంగా మరిన్ని సక్సెస్ లను అందుకోవాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఐతే త్రివిక్రమ్ శ్రీనివాస్ సంయుక్తకు కెరీర్ పరంగా హెల్ప్ చేస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.కానీ ఇది ఎంత వరకు నిజం అనేది ఇంకా తెలీదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: