అమీర్ ఖాన్ ప్రయోగాన్ని అంగీకరించిన అనుష్క !

Seetha Sailaja

‘బాహుబలి’ తరువాత అనుష్క ఒక్క సినిమాలో కూడ నటించలేకపోయింది. వాస్తవానికి ఆమెకు అవకాశాలు రావడం లేదా లేదంటే వచ్చిన అవకాశాలను ఆమె తిరస్కరిస్తోంద అన్నవిషయం పై ఎవరికీ స్పష్టమైన క్లారిటీలేదు. యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి పక్కన ఈమె నటిస్తున్న సినిమా ప్రారంభం అయినప్పటికీ ఆసినిమా ఎప్పుడు విడుదల అవుతుందో ఎవరికీ క్లారిటీ లేదు.

ఈమధ్య మహాశివరాత్రి రోజున ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీకాళహస్తి వెళ్ళి అక్కడ ఆమె అభిషేకం చేయించుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారి అందరి దృష్టిని ఆకర్షించాయి. అయితే ఆ ఫోటోలలో ఆమె లుక్ ను చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. ఆమె మరింత లావుగా మారినట్లు ఆ ఫోటోలను బట్టి ఎవరికైనా అర్థం అవుతుంది.

ఇలాంటి పరిస్థితుల మధ్య ఈమెకు సంబంధించిన ఒక న్యూస్ ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ప్రముఖ తమిళ దర్శకుడు ఏఎల్. విజయ్ త్వరలో ప్రారంభించ బోతున్న ఒక హీరోయిన్ ఒరియేంటెడ్ మూవీలో ఆమెను నటించ చేయడానికి విజయ్ చాల కష్టపడి అనుష్క ను ఒప్పించినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె చాల లావుగా కనిపిస్తూ ఉండటంతో సినిమాలో అలా కనిపించకుండా ఆమె నాజూకుగా కనిపించడానికి ‘లాల్ సింగ్ చద్దా’ మూవీలో అమీర్ ఖాన్ 20 ఏళ్ల కుర్రాడుగా కనిపించడానికి ఉపయోగించిన టెక్నాలజీని అనుష్క కు ఉపయోగించడానికి విజయ్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

వాస్తవానికి ‘బాహుబలి 2’ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కోసం రాజమౌళి అనుష్క విషయంలో ఇలాంటి టెక్నాలజీని వాడాడు అంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇప్పుడు విజయ్ మరింత అధునాతన టెక్నాలజీ తో అనుష్క పై చేస్తున్న ప్రయోగం ఎంతవరకు సక్సస్ అవుతుందో వేచి చూడాలి. అయితే ఈ టెక్నాలజీ చాల ఖర్చుతో కూడుకున్న పని. ఇలాంటి పరిస్థితులలో ఇంత ఖర్చుపెట్టి అనుష్క కోసం ఎంతమంది అవకాశాలు ఇస్తారు అన్నది ప్రశ్న..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: