ఆ సాంగ్ చేసి పెద్ద రిస్క్ చేస్తున్న శ్రీలీల....!!

murali krishna
ప్రస్తుతం టాలీవుడ్ లో మల్టీస్టార్ మూవీ హవా నడుస్తుంది. ఆ నేపధ్యంలో వస్తున్నా కాంబో మూవీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ -సాయి ధరమ్ తేజ్ మూవీ. ఐతే ఈ మూవీ  వినోదయ సీతం రీమేక్. ఐతే ఆ సినిమాలో ఉన్నా ఒక స్పెషల్ సాంగ్ లో శ్రీలీలకు ఛాన్స్ వచ్చిందని మనకు ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం.
ఐతే పెళ్లిసందడి మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ధమాకాతో మరో హిట్ అందుకుంది. ఇలా వరుసగా సినిమాలు చేస్తున్న శ్రీ లీల పవన్ సినిమాలో సాంగ్ అనేసరికి అటెన్షన్ గ్రాబ్ చేసింది. ఐతే ఇప్పటికే యూత్ ఆడియన్స్ అంతా ఆమెంటే పడి చస్తుంటే ఇక పవర్ స్టార్ సినిమాలో సాంగ్ అనేసరికి మరింత ఎగ్జైట్మెంట్ అవుతున్నారు. అయితే కెరీర్ మంచి స్వింగ్ లో ఉన్న ఈ టైం లో స్పెషల్ సాంగ్ చేయడం పెద్ద రిస్క్ అని చెప్పొచ్చు. ఐతే ఆమెపరిస్థితి ఎలా ఉందంటే అక్కడ ఉంది పవర్ స్టార్ కాబట్టి నో అని చెప్పలేని పరిస్థితి.
కనుకనే  శ్రీ లీలకు స్పెషల్ సాంగ్ చేయడం ఇష్టం లేకపోయినా సరే స్పెషల్ సాంగ్ కి ఒప్పేసుకుందట. కాకపోతే అందుకు తగినట్టుగా భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. ఐతే ఒక్క సాంగ్ కోసమే అమ్మడు కోటి రూపాయల రెమ్యునరేషన్ అడిగేసిందట. మనకు మేకర్స్ నుండి అందిన సమాచారం ప్రకారం శ్రీలీలకు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆమె అడిగినంత ఇచ్చేందుకు రెడీ అయినట్టు టాక్. ధమాకా చేసిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ లోనే వినోదయ సీతం తెలుగు రీమేక్ వస్తుంది కాబట్టి శ్రీలీలకు మరో లక్కీ ఛాన్స్ వచ్చినట్టే. మరి ఈ సాంగ్ లో శ్రీ లీల ఏ రేంజ్ లో ఊపేస్తుందో చూడాలి.
ఇదిలా ఉంటే కొంతమంది శ్రీలీల అభిమానులు మాత్రం స్పెషల్ సాంగ్ చేయటం పై అయిష్టం చూపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: