కోనసీమ థగ్స్: సినిమాలో అదే ప్లస్ పాయింట్ ?

Purushottham Vinay
ఇక కోనసీమ థగ్స్ సినిమా ఈరోజు విడుదల అయ్యింది. ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం.ఆవేశంలో తప్పులు చేసి శిక్ష అనుభవించే ఖైదీల జీవితాల ఆధారంగా కొంత ఎమోషన్స్, కొంత యాక్షన్‌తో రూపొందిన సినిమా కొనసీమ థగ్స్.ఈ సినిమాలో యాక్షన్ సీన్లు చాలా కొత్తగా ఉండటమే కాకుండా సినిమాను మరో లెవెల్ కి తీసుకెళ్లే ప్రయత్నం చేశాయి. ఇక హిృదు హారన్ యాక్టింగ్, యాక్షన్ అలాగే ఫైట్ల విషయంలో పూర్తిగా ఇరుగదీశాడనే చెప్పవచ్చు. సినిమా కథను ఒంటి చేత్తో తన భుజాలపైనే మోయడం అభినందించదగిన విషయం. అయితే కథలో భావోద్వేగాలు సరిగ్గా లేకపోవడంతో హిృందూ కూడా ఏమీ చేయలేకపోయాడు.అలాగే ఇందులో కోయిల పాత్రకు పెద్దగా స్కోప్ కూడా లేదు. బాబీ సింహా లాంటి నటుడిని కూడా పెద్దగా వాడుకోలేకపోవడం అంటే ఖచ్చితంగా డైరెక్టర్ ని తప్పు పట్టాల్సిందే. మిగితా పాత్రల్లో నటించిన వారు తమ పాత్రలకు కొంచెం న్యాయం చేశారని చెప్పవచ్చు.లేడీ కొరియోగ్రాఫర్ ఇంకా డైరెక్టర్ అయిన బృంద టేకింగ్, మేకింగ్ అయితే సూపర్ ఉంది.

కానీ కథ బలహీనం, అలాగే కథనంలో లోపాలు ఈ సినిమాకు మైనస్ గా మారే అవకాశం ఉంది. ఈ సినిమా మొత్తం కూడా జైలులోనే సాగడం ఇంకా సన్నివేశాలు సాగదీసినట్టు ఉండటం వల్ల కథలో అంతగా కొత్తదనం కనిపించలేదు. కథ, కథనాలను చాలా బలంగా రాసుకొని జైలులో ఎమోషన్స్ పండించాల్సి ఉండేదనిపిస్తుంది. ఇక సామ్ సీఎస్ మ్యూజిక్ అయితే ఎప్పటిలాగానే బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సూపర్. ఇది చాలా సీన్లను హైలెట్ చేసింది. సినిమాటోగ్రఫి విషయానికి వస్తే ప్రియేష్ గురుస్వామి పనితనం చాలా బాగుంది. లైటింగ్ ఇంకా కలర్ ప్యాలెట్ ఉపయోగించిన విధానం చాలా పర్‌ఫెక్ట్‌గా ఉంది. ఎడిటర్ ప్రవీణ్ ఆంటోని కొంచెం ఎడిట్ చేసుంటే బాగుండేది. కథలో భావోద్వేగాలు తేలిపోవడంతో రొటీన్ సినిమా చూస్తున్నామనే ఫీలింగ్ ఖచ్చితంగా కలుగుతుంది. కాకపోతే యాక్షన్ సీన్లు ఇంకా బీజీఎం లాంటి టెక్నికల్ అంశాలు సినిమాకు చాలా పాజిటివ్‌గా మారాయి. యాక్షన్ సినిమాలని ఆదరించే వారికి కొనసీమ థగ్స్ తప్పకుండా నచ్చుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: