శాకుంతలం: పరిస్థితి తేడాగా ఉందిగా?

Purushottham Vinay
హాట్ బ్యూటీ సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమా శాకుంతలం. ఈ సినిమాని ఎప్పటినుంచో వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వేస్తూ ఏప్రిల్ 14వ తేదీన విడుదల చేస్తామని చెబుతున్నారు కానీ అప్పటికైనా విడుదలవుతుందా లేదా అనే విషయం మీద ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. అయితే ప్రస్తుతానికి ఉన్న సమాచారం ప్రకారం 2023వ సంవత్సరంలో ఏప్రిల్ 14వ తేదీన ఈ సినిమా విడుదలవుతోంది. శకుంతల దుష్యంతుల కథను ఆధారంగా చేసుకుని దర్శకుడు గుణశేఖర్ ఈ సినిమాను చాలా బాగా రూపొందించారు. గుణశేఖర్ సొంత ప్రొడక్షన్లో నిర్మించిన ఈ సినిమా హక్కులను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుకు అమ్మేయడంతో ఈ సినిమా నిర్మాణ అనంతర బాధ్యతలు అన్ని దిల్ రాజు చూసుకుంటున్నారు.ఇక ఈ సినిమాకి భారీ లాభాలు వచ్చే అవకాశం ఉందని కూడా అంచనాలు వేసుకుంటున్నారు.


 కానీ ఒకవేళ తేడా పడితే పరిస్థితి ఏమిటి అనే విషయం మీద అందరిలో కూడా ఇప్పుడు పెద్ద టెన్షన్ వాతావరణం అనేది నెలకొంది.. ఇక శకుంతలగా సమంత నటిస్తున్న ఈ సినిమాలో దుష్యంతుడిగా మలయాళ యంగ్ హీరో దేవ్ మోహన్ నటిస్తున్నాడు. ఇక భరతుడి చిన్ననాటి పాత్రలో అల్లు అర్జున్ గారాల కుమార్తె అయిన అల్లు అర్హ నటిస్తోంది.దీంతో ఈ సినిమా మీద ప్రేక్షకులలో కొంచెం అంచనాలు ఏర్పడ్డాయి.అయితే ఇన్ని సార్లు వాయిదా పడిన సినిమాలు గతంలో ఫెయిల్ అయిన దాఖలాలే చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి సమంత సినిమాకి ఆ సెంటిమెంట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది రిలీజ్ అయ్యాక చూడాల్సి ఉంది. అయితే ఎన్నిసార్లు వాయిదా పడినా కంటెంట్ బాగుంటే  హిట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అది త్వరలో మనం ఇంకా చూడాల్సి ఉంది. ఇక ఈ సినిమా ఏప్రిల్ 14వ తేదీ 2023వ సంవత్సరంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ వంటి పాన్ ఇండియా భాషలలో ఏకకాలంలో విడుదలకు రంగం సిద్ధం అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: