బంపర్ ఆఫర్ కొట్టేసిన వింక్ బ్యూటీ.. ఏకంగా మెగా మల్టీస్టారర్ లో ఛాన్స్..?

Anilkumar
వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఓ చిన్న వీడియోతో సోషల్ మీడియాలో నేషనల్ వైడ్ గా పాపులారిటిని దక్కించుకుంది ఈ బ్యూటీ. ఈ అమ్మడి కన్ను గీటిన వీడియో అప్పట్లో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఆ వీడియోతో వచ్చిన క్రేజ్ వల్ల ఈమెకి సినిమాల్లో కూడా అవకాశాలు రావడం జరిగింది. తెలుగు తో పాటు హిందీలో కూడా పలు సినిమా ఆఫర్లు వచ్చినా.. ఆ సినిమాలేవి బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకోలేకపోయాయి. అప్పటినుంచి సినిమాలతో బిజీ అవ్వకపోయినా సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్ గా ఉంటూ తన గ్లామర్ తో కుర్రకారుల మతులు పోగొడుతుంది. 

తన హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ నేటిజన్స్ చూపు తిప్పుకోకుండా చేస్తోంది. దీంతో ప్రియా వారియర్ కి సోషల్ మీడియాలో రోజురోజుకీ పాపులాటి పెరిగిపోయింది. ఈ యంగ్ బ్యూటీ ని ఇంస్టాగ్రామ్ లో ఏకంగా 74 లక్షల మంది ఫాలో అవుతుండడం విశేషం. అయితే తాజాగా ఈ అమ్మడికి ఓ బంపర్ ఆఫర్ తగిలింది. ఇప్పటివరకు సినిమాలపరంగా సరైన హిట్ లేక ఇబ్బందులు పడుతున్న ప్రియా ప్రకాష్ వారియర్ కు ఏకంగా మెగా మల్టీ స్టార్ లో నటించే అవకాశం దక్కినట్లు సమాచారం. ఇంతకీ అసలు మేటర్ ఏంటంటే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి తేజ్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

తమిళంలో సూపర్ హిట్ అయిన వినోదయ సీతం అనే సినిమాకి ఇది రీమేక్ గా రూపొందుతోంది. సముద్రఖని ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలోని ప్రియా ప్రకాష్ వారియర్ ఓ హీరోయిన్గా నటించబోతున్నట్లు సమాచారం. మెగా మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా కేతిక శర్మని ఎంపిక చేయగా.. ఇప్పుడు మరో హీరోయిన్ కోసం ప్రియా ప్రకాష్ వారియర్ ని చిత్ర యూనిట్ ఫైనల్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో వాస్తవం ఎంతుందో తెలియాలంటే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే. ఒకవేళ ఇదే వార్త కనుక నిజమైతే ప్రియ వారియర్ కి ఈ మూవీ కెరీర్ పరంగా మంచి బూస్ట్ ని ఇస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: