పెళ్లి తరువాత ఆ రాత్రి ఎంతో ప్రత్యేకంగా ఉంది : కియారా అద్వానీ

murali krishna
చిత్ర పరిశ్రమలోని హీరోయిన్ లు తమ వ్యక్తిగత విషయాలను కూడా అందరితో పంచుకుంటున్నారు. ఒకప్పుడు మాత్రం ఏ విషయమైన కూడా ఎంతో రహస్యంగా ఉంచేవాళ్లు.
ఆ విషయం బయటపడకుండా జాగ్రత్త పడేవాళ్లు. కానీ ఇప్పుడు అయితే అలా కాదు.. ఎవరితో డేటింగ్ చేసినా కూడా వెంటనే బయటికి చెప్పేసుకుంటున్నారు. ఇక సోషల్ మీడియా కూడా అందుబాటులో ఉండటంతో తమ వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు ప్రేక్షకులతో పంచుకుంటున్నారు. అయితే తాజాగా కియారా అద్వానీ కూడా ఒక విషయాన్ని బయట పెట్టింది.
బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన బ్యూటీ కియారా అద్వానీ. ఈ బ్యూటీ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తన అందంతో ఎంతో మంది కుర్రాళ్ళ మనసులను కొల్ల గొట్టింది.టాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా ఈ ముద్దుగుమ్మ బాగా తెలుసు..అతి తక్కువ సమయంలో ఎంతో మంది అభిమానులను ఆమె సంపాదించుకుంది. ఇక సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటుంది.ఫగ్లీ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి ఆమె పరిచయం అయింది. ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకోవడంతో ఎంఎస్ ధోని సినిమాలో కూడా అవకాశాన్ని అందుకుంది. ఈ సినిమా తో కూడా మంచి సక్సెస్ అందుకుంది. దాంతో టాలీవుడ్ లో మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఆమె పరిచయం అయింది.  అలా చాలా వరకు మంచి సక్సెస్ లను అందుకుని స్టార్ స్టేటస్ దక్కించుకుంది. ఇక సోషల్ మీడియాలో మాత్రం తన హాట్ ఫోటోలతో బాగా సందడి చేస్తుంది. ఎప్పటికప్పుడు ఫోటో షూట్ లు చేయించుకుంటూ తన ఫాలోవర్స్ ను కూడా ఆకట్టుకుంటుంది. అయితే ఈ బ్యూటీ ఇటీవలే తను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.గత కొంతకాలం నుంచి సిద్ధార్థ్ మల్హోత్రా డేటింగ్ లో ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇటీవలే తమ కుటుంబ సమ్మక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి ని జరుపుకుంది. సినీ ప్రముఖులతో పాటు పెద్దపెద్ద వి ఐ పి లు కూడా పెళ్ళికి వచ్చారు. ఇక సోషల్ మీడియా వేదికగా తనకు టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు కూడా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక ప్రస్తుతం తన కొత్త జీవితాన్ని బాగా ఎంజాయ్ చేస్తుందట ఈ బ్యూటీ. తన భర్తతో దిగిన ఫోటోలను బాగా షేర్ చేస్తూ ఉంది. అయితే తాజాగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలను ఆమె పంచుకుంది. అందులో తన భర్తతో డాన్స్ చేస్తున్నట్లు కూడా కొన్ని స్టిల్స్ కనిపించాయి. ఇక ఆ ఫోటోలో తను ఎంతో సంతోషంగా కనిపించింది.ఇక ఆ ఫోటోకు ఒక క్యాప్షన్ కూడా పెట్టింది.. ఆ రాత్రి గురించి అస్సలు ఏం చెప్పాలి.. నిజంగా నాకు స్పెషల్ గా ఉంది అంటూ డాన్స్ చేస్తున్న ఎమోజీలతో ఆమె పంచుకుంది. అంటే తన భర్తతో బాగా డాన్స్ చేసినట్లు చెప్పుకొచ్చింది. అయితే ఆ క్యాప్షన్ చూసి కొందరు నెటిజన్స్ రకరకాలుగా కామెంట్లు అయితే పెడుతున్నారు. డాన్స్ మాత్రమే ఉందా ఇంకేమైనా ఉందా అంటూ కామెంట్ లు చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: