కాంతారా 2 లో అలాంటి పాత్రలో నటించనున్న రజినీకాంత్..!?

Anilkumar
రిషబ్ శెట్టి హీరోగా స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంతారా సినిమా ఎంతటి సంచలనాలను సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అన్ని భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రతి ఒక్క భాషలో కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అన్ని భాషల్లో కలిపి ఈ సినిమా దాదాపు 300 కోట్లకు పైగాని కలెక్షన్లను రాబట్టింది. కేజిఎఫ్ సీరీస్ తర్వాత హిందీలో అత్యధిక కలెక్షన్స్ ను సొంతం చేసుకున్న సినిమాగా కాంతారా మూవీ నిలిచింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ ని కూడా తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు రిషబ్
 పార్ట్ టు కి సంబంధించిన స్టోరీ పై ప్రస్తుతం వర్క్ చేస్తున్నట్లుగా సమాచారం.

 అంతేకాదు ఈ సినిమా సీక్వల్ ని బ్రాండ్ ఇయర్ గా ఆవిష్కరించడానికి నా నా విధులుగా రిషబ్ ప్రయత్నిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇంట్లో భాగంగానే అన్ని భాషలకి చెందిన క్యాస్టింగ్ను సినిమా కోసం ఎంపిక చేస్తున్నారట. ఇక ఇప్పటికే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ  రౌటెల నెక్ ఫిక్స్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. అంతేకాదు ఈ సినిమాలో ఆమె రోల్. చాలా కీలకం అని కూడా అంటున్నారు. అయితే తాజాగా రిషబ్ రజనీకాంత్ కలవడం జరిగింది. అయితే ఈ సినిమాలో ఒక కామియో రోల్ ని రజనీకాంత్ కి  రిషబ్  చేయమని అడిగినట్లుగా సమాచారం. ఇందుకు సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా ఓకే చెప్పినట్లుగా తెలుస్తుంది.

ఇక ఈ క్రమంలోనే ఈ వార్త తెలిసిన చాలామంది ఈ సినిమాలో సూపర్ స్టార్ గనుక నటిస్తే ఈ సినిమా మరింత విజయాన్ని సొంతం చేసుకుంటుంది అని అంటున్నారు. అంతేకాదు ఈ సినిమాలో రజనీకాంత్ నటిస్తే తమిళంలో ఎక్కువమంది చూసే అవకాశం ఉంటుంది. ఇక ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రజనీకాంత్ ని రిషబ్ శెట్టి ఒప్పించినట్లుగా సమాచారం. ఇప్పటికే కాంతారా సినిమాని చూసిన రజనీకాంత్ ఇంప్రెస్ అయ్యి రిషబ్ని అభినందించిన సంగతి మీ అందరికీ తెలిసింది. దీంతో కచ్చితంగా కాంతారా రజనీకాంత్ ఉంటారు అని అందరూ భావిస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: