సార్ సినిమా నాలో మార్పును తీసుకొచ్చింది అంటూ ఎమోషనల్ అయిన హైపర్ ఆది...!!

murali krishna
టాలీవుడ్ కమెడియన్ హైపర్ ఆది బుల్లితెర టాప్ కమెడియన్లలో ఒకరిగా కొనసాగుతుండగా సార్ మూవీ హైపర్ ఆదికి మంచి పేరు ను తెచ్చిపెట్టింది.కొన్ని సన్నివేశాల్లో ఆది చెప్పిన డైలాగ్స్ సినిమాకు ఎంతో హైలెట్ గా నిలిచాయి.
సీరియస్ గా సాగిన సార్ మూవీలో హైపర్ ఆది నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే సార్ మూవీ సక్సెస్ మీట్ లో ఆది చెప్పిన విషయాలు బాగా వైరల్ అవుతున్నాయి.
హైపర్ ఆది మాట్లాడుతూ డబ్బుకు కాకుండా మనుషులకు మరియు మనస్తత్వాలకు విలువ ఇచ్చే వ్యక్తి ఆర్.నారాయణమూర్తి అని ఈ ఈవెంట్ కు గెస్ట్ గా హాజరైన నారాయణ మూర్తి గురించి హైపర్ ఆది కామెంట్స్ చేశారు. ఒక సామాన్యుని గురించి పోరాడాలంటే మనం కూడా సామాన్యుడిగా ఉండాలని ఆయన ఎప్పుడూ భావిస్తారని హైపర్ ఆది అన్నారు. సార్ మూవీ మంచి కథాంశం గల సినిమా అని ఆయన వెల్లడించారు.
ఈ సినిమా బాగా చదువుకోని వాళ్లకు చదువు విలువ తెలిసేలా చేసిందని చదువుకున్న వాళ్లకు ఎలా ప్రవర్తించాలో  కూడా తెలిసేలా చేసిందని ఆయన అన్నారు. ఈ సినిమాతో ధనుష్ పై మరింత ప్రేమ పెరిగిందని హైపర్ ఆది చెప్పుకొచ్చారు.. ఈ సినిమా వల్ల ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మార్పు వస్తుందని నేను అనుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు. కులం గురించి సినిమాలో వున్నా డైలాగ్స్ బాగున్నాయని ఎంతో ఆలోచింపజేస్తాయని హైపర్ ఆది అన్నారు.
ఈరోజుల్లో ప్రేమ అంటే చాలా దారుణంగా ఉందని ఆయన తెలిపారు. ఈ సినిమా చూసిన తర్వాత మా సార్ సుబ్రహ్మణ్యం సార్ కు కాల్ చేసి తప్పు చేసి ఉంటే క్షమించాలని అడగగా రాంగ్ నంబర్ అని చెప్పారని హైపర్ ఆది చెప్పుకొచ్చారట.. ఆ తర్వాత నంబర్ కరెక్ట్ గా కనుక్కొని ఫోన్ చేసి సారీ చెప్పానని ఆయన చెప్పుకొచ్చారు.. ఈ టైంలో కాల్ చేశావేంటని సార్ తిట్టారని హైపర్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: