అఖిల్ సినిమా ఓటీటీ డీల్ ఎవరికంటే..!

shami
అక్కినేని యువ హీరో అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో వస్తున్న క్రేజీ సినిమా ఏజెంట్. ఏకె ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ లో అనీల్ సుంకర భారీ బడ్జెట్ తో ఈ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా విషయంలో ఎన్ని రూమర్స్ వచ్చినా రిలీజ్ చేస్తున్న ప్రచార చిత్రాలు మాత్రం సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. ఈ సినిమా రిలీజ్ డేట్ ని లాక్ చేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 28న ఈ సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారు. సినిమా థియేట్రికల్ బిజినెస్ కూడా అదిరిపోయిందని తెలుస్తుంది. పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా ఓటీటీ హక్కులు కూడా ఫ్యాన్సీ ధరకు కొనుగులు చేశారట.
సోనీ లివ్ ఓటీటీ సంస్థ అఖిల్ ఏజెంట్ సినిమాను ఓటీటీ హక్కులు సొంతం చేసుకుందని తెలుస్తుంది. ఇందుకు గాను నిర్మాతకు మంచి ఆఫర్ ఇచ్చారట. పాన్ ఇండియా సినిమా కాబట్టి భారీ ధర చెప్పినట్టు టాక్. ఈమధ్య సోనీ లివ్ కూడా తెలుగు సినిమాల మీద ఆసక్తి చూపిస్తుంది. ఈ క్రమంలో అఖిల్ ఏజెంట్ సినిమాకు క్రేజీ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తుంది. భారీ హంగులతో కమర్షియల్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఏజెంట్ సినిమాపై అఖిల్ చాలా నమ్మకంగా ఉన్నాడు. అఖిల్ లుక్, యాక్షన్ సీన్స్ అన్ని ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్ అందిస్తాయని అంటున్నారు.
అఖిల్ మొదటి సినిమా తర్వాత అంచనాలకు మించి బడ్జెట్ పెట్టిన సినిమా ఇదే అని తెలుస్తుంది. సురేందర్ రెడ్డి మీద ఉన్న నమ్మకంతో నిర్మాత బడ్జెట్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవలేదని తెలుస్తుంది. అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు హిప్ హాప్ తమిళ మ్యూజిక్ అందిస్తున్నారు. మరి సమ్మర్ కి అఖిల్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రేక్షకులను ఏమేరకు ఎంటర్టైన్ చేస్తుందో చూడాలి. ఈ సినిమా హిట్ పడితే సురేందర్ రెడ్డికి రెండు భారీ కమిట్ మెంట్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ఏజెంట్ రిజల్ట్ మీద ఆ సినిమాలు ఆధారపడి ఉన్నట్టు టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: