వైరల్ గా మారిన రేణుదేశాయ్ పోస్ట్....!!

murali krishna
నటిగా ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించిన రేణు దేశాయ్ కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్ కు భార్యగా కూడా ఈమె గురించి అందరికీ  తెలుసు అయితే ప్రస్తుతం వీరిద్దరు విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే .
          ఇక రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయిన తర్వాత తన పిల్లలతో కలిసి ఒంటరిగా బతుకుతున్నారు. ప్రస్తుతం ఈమె తిరిగి సినిమాలలోకి రావడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే రవితేజ హీరోగా నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.
              ఇలా సినిమాలతో బిజీ అవుతున్నటువంటి రేణు దేశాయ్ నిత్యం తన పిల్లలతో కలిసి వెకేషన్ లకు వెళుతూ అందుకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.ఇకపోతే తాజాగా రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా మన జీవన విధానం గురించి ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. అయితే ఈమె పోస్ట్ చూస్తే కనుక ఒకసారి మనం ఎలాంటి బ్రతుకు బ్రతుకుతున్నామో అని అందరిని ఆలోచింపచేసేలా ఉన్నాయి. మనం ప్రస్తుతం ఆత్యాధునిక కాలంలో ఉన్నామని ఎంతో ఎత్తుకు ఎదుగుతూ ఉన్నామని భావిస్తున్నాం అయితే మనకు తెలియనిది ఏందంటే మనం మన మూలాలను కూడా మరిచిపోయి కేవలం నాలుగు గోడల మధ్య మాత్రమే జీవిస్తున్నామని ఈమె తెలిపారు. ఇలా మనం నాలుగు గోడల మధ్య బ్రతుకుతూ ప్రకృతిని పూర్తిగా మర్చిపోతున్నామని తెలియజేశారు. ఎత్తయిన భవంతులలో లగ్జరీ లైఫ్ గడుపుతూ మనం ఎంతో సాధించి ఎంతో ఎత్తుకు ఎదిగా అనుకుంటున్నాం... కానీ మనం ఎంతో పేదవాళ్ళం.. ప్రకృతికి అల్లంత దూరంలో ఉన్నామనిఈమె తెలిపారు. అయితే ఇలా తాను మాత్రమే ఆలోచిస్తున్నానా? లేకపోతే అభివృద్ధి పేరిట మనం మన మూలాలను మర్చిపోయామా అంటూ ఈమె పోస్ట్ చేశారు. ఇక ఈ పోస్ట్ చేస్తూ ఆధ్యా పెరిగి పెద్దయిన తర్వాత తాను ఇలాంటి లైఫ్ జీవించనని వెళ్లి అడవులలో నివసిస్తాను అంటూ చెబుతుందని ఈమె ఈ పోస్టుకు క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం రేణు దేశాయ్ చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: