అదిరిపోయే ఛాన్స్ కొట్టేసిన మృనాల్ ఠాకూర్...!!

murali krishna
హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన పీరియాడికల్ లవ్ స్టోరీ అయిన సీతారామం. ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది బాలీవుడ్ హీరోయిన్ అయిన మృణాల్ ఠాకూర్.
సీతగా ఈ సినిమాలో మెస్మరైజ్ చేసిన ఈ ముద్దుగుమ్మ ఈమె మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో ఆకట్టుకుంది. ఆగస్టులో విడుదలైన ఈ సినిమా అనూహ్య విజయాన్ని అయితే అందుకుంది. ఇక అంతే కాకుండా విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా అందుకుంది.
 
 వరస క్రేజీ ఆఫర్ల ను సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవలే నాని సినిమా లో కూడా నటించబోతోందని సమాచారం.. మరి ఇప్పుడు గోల్డెన్ అవకాశాన్ని అందుకున్నట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అసలు వివరాల్లో కి వస్తే రామ్ చరణ్ rrr సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించారు. ప్రస్తుతం హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కేమరూన్ నుంచి ప్రత్యేకమైన ప్రశంసలు కూడా అందుకున్నారు. ప్రస్తుతం ఆస్కార్ బరి లో నిలిచిన rrr సినిమా తర్వాత రామ్ చరణ్ వరుస క్రేజీ సినిమాలలో నటించబోతున్నారు.
డైరెక్టర్ శంకర్ తో రామ్ చరణ్  తన 15వ సినిమా ను చేస్తున్నారు. ఇక ఇదంతా ఇలా ఉంటే ఈ సినిమా అయిపోయిన వెంటనే రామ్ చరణ్  ఉప్పెన ఫేమ్ అయిన బుచ్చిబాబుతో ఒక చిత్రానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు. అయితే ఇందులో రామ్ చరణ్ కు జోడిగా మృణాల్ ఠాకూర్ నటించబోతున్నట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ సినిమాని కూడా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారని తెలుస్తుంది.త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా రాబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాతో మృనాల్ ఠాకూర్ స్టార్ హీరోయిన్ గా మారాలని చూస్తుంది. సీతా రామం సినిమాలో ఎంతో పద్దతిగా కనిపించిన మృనాల్ ఇప్పుడు వరుసగా గ్లామర్ పాత్రలను ఎంచుకుంటుంది.హాట్ అందాలతో అందరిని కూడా బాగా రెచ్చ గొడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: