జూ. ఎన్టీఆర్ లేకపోతే నా పరిస్థితి దారుణం ::తారకరత్న

murali krishna
టాలీవుడ్ బాద్షా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మనస్సు చాలా మంచిదని అని ఇండస్ట్రీలో చాలామంది చెబుతారు. ఆయన కుటుంబ సభ్యులకు ఏ చిన్న కష్టం వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ తట్టుకోలేరనే సంగతి కూడా అందరికి తెలిసిందే.
ఐతే జూనియర్ ఎన్టీఆర్ తారకరత్నకు చేసిన ఆర్ధిక సహాయం గురించి కొంచం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాంట్లో భాగంగానే తారకరత్నకు ఎన్టీఆర్ నెలకు 4 లక్షలు ఆర్ధిక  సహాయం చేశారని సమాచారం అందింది.
ఐతే ఒక సందర్భంలో తారకరత్న మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ యొక్క గొప్పదనాన్ని చెప్పుకొచ్చారు. ఈరోజు మా ఫ్యామిలీ  ఈ విధంగా ఉండటానికి కారణం నా తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ అని ఆయన తెలిపారు.నా తమ్ముడు లేని పక్షంలో నా పరిస్థితి చాలా దారుణంగా ఉండేదని తారకరత్న చెప్పుకొచ్చారు. నేను నా ఫ్యామిలీ ని పోషించుకోలేని స్టేజ్ లో  ఉన్న టైం లో జూనియర్ ఎన్టీఆర్ నుంచి సహాయం అందిందని ఆయన తెలిపారు.
ఐతే ఆ టైం నుండి ఈ టైం వరకు జూనియర్ ఎన్టీఆర్ నుంచి తారకరత్నకు సహాయం అందుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఐతే తారకరత్న కుటుంబానికి ఆర్థిక సహాయం చేసినా జూనియర్ ఎన్టీఆర్  మాత్రం ఆ సహాయాన్ని ఎప్పుడూ చెప్పుకోలేదు.ఇదిలా ఉంటే మరోవైపు ఈ ఘటన వల్ల తారక్ కొరటాల కాంబో మూవీ పూజా కార్యక్రమాలు వాయిదా పడ్డాయని ఇండస్ట్రీ వర్గాల్లో చెప్పుకుంటున్నారు. ఐతే ఇందుకు సంబంధించి అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.
నందమూరి తారకరత్న గారి మరణం ఆయన మరియు నందమూరి ఫ్యాన్స్ను చాలా  బాధ పెట్టగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఐతే నందమూరి కుటుంబంలో చోటు చేసుకుంటున్న విషాద ఘటనలు కుటుంబ సభ్యులను ఎంతగానో బాధ పెడుతున్నాయి.వారిలో జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ పరంగా వరుస విజయాలతో కెరీర్ ను కొనసాగిస్తుండగా తర్వాత సినిమాలు సక్సెస్ సాధిస్తే తారక్ క్రేజ్ పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి.
ఏదేమైనా తారక్ గారి ఆత్మ శాంటించాలని ఆ దేవుడ్ని కోరుకుంటున్నారు నేటిజన్లు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: