అమ్మోరు గా మారిపోయిన లావణ్య త్రిపాఠి...!!

murali krishna
అందాల రాక్షసి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన లావణ్య త్రిపాఠి.ఆ తర్వాత వరుసగా వచ్చిన అవకాశాలను అందుకుంటుంది.
తెలుగులో చివరిగా హ్యాపీ బర్త్డే సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. తెలుగులో లావణ్య త్రిపాఠి మంచు విష్ణు, శర్వానంద్, నాగార్జున, నాని, నాగచైతన్య మరియు కార్తికేయ లాంటి హీరోల సరసన నటించి మెప్పించింది . ఇది ఇలా ఉంటే లావణ్య త్రిపాఠి తాజాగా నటించిన సినిమా పులిమేక. ఈ సినిమాకు చక్రవర్తి రెడ్డి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో లావణ్య పార్టీతోపాటు ఆది సాయి కుమార్, సిరి హనుమంత్, సుమన్, గోపరాజు,కరుణాకర్ శర్మ, పల్లవి, రంగారావు, పల్లవి శ్వేత తదితరులు కీలక పాత్రలో నటించారు. ఇకపోతే ఈ సినిమా ఫిబ్రవరి 24 నుంచి జి 5 లో స్ట్రీమింగ్ కానుందట. కాగా ఇటీవలే పులిమేక టీజర్ ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా టీజర్ కు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది. తాజాగా శివరాత్రి పండుగ సందర్భం గా లావణ్య త్రిపాఠి పాత్రలోని హీరోయిన్ యాంగిల్ ను ఎలివేట్ చేసే స్పెషల్ గ్లింప్స్ ను టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన రకుల్ ప్రీత్ సింగ్ విడుదల చేసింది. ఇకపోతే ఆ గ్లింప్స్ లో లావణ్య త్రిపాఠి ముఖానికి అంతా పసుపు పూసుకొని అమ్మోరు లాంటి వేషధారణ లో కనిపించిందట.చీరకట్టులో చేతిలో గన్ను పట్టుకొని ఫైట్ సీన్స్ ని అదరగొట్టేసింది. ఇకపోతే ఈ పులి మేక లో లావణ్య త్రిపాఠి కిరణ ప్రభ అనే ఒక ఐపీఎస్ ఆఫీసర్గా నటించిందని తెలుస్తుంది. ఈ మధ్యకాలం లో ఈ ముద్దుగుమ్మ సినిమాలలో నటించలేదు అన్న సంగతి మనందరికీ తెలిసిందే. అందం అభినయం ఉన్నప్పటికీ అవకాశాలు మాత్రం రావడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: