ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఫ్రీ.. పాపం ఆ హిట్ మూవీ కి ఎన్ని కష్టాలో?

praveen
త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన అలా వైకుంఠపురములో సినిమా ఎంత బ్లాక్ బస్టర్  విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో నాన్ బాహుబలి రికార్డులను క్రియేట్ చేసింది ఈ సినిమా. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది అని చెప్పాలి. ఈ సినిమా కోసం త్రివిక్రమ్ రాసుకున్న స్టోరీ అటు ప్రేక్షకులందరినీ ఫిదా చేసేసింది. ఇక అల్లు అర్జున్ నటన గురించి అయితే ఎంత చెప్పినా తక్కువే. ఇక అలాంటి సూపర్ హిట్ మూవీ అలా వైకుంఠపురం లో సినిమాని ఇటీవల హిందీలో డబ్ చేశారు.

 షహజాద అనే సినిమాతో కార్తీక్ ఆర్యన్  హీరోగా నటించి ఇక అలా వైకుంఠపురం హిందీ రీమేక్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఈ సూపర్ హిట్ మూవీకి అక్కడ ఆశించినంత ఫలితం మాత్రం దక్కడం  లేదు అని చెప్పాలి. సాధారణంగానే త్రివిక్రమ్ సినిమాల రీమేక్  ప్రేక్షకులకు అస్సలు నచ్చదు. ఎందుకంటే త్రివిక్రమ్ మ్యాజిక్ రీమేక్ సినిమాలలో అసలు రిపీట్ కాదు అని చెప్పాలి. ఇటీవల విడుదలైన షహజాద  సినిమాకు మొదటి రోజు నుంచి నెగిటివ్ రెస్పాన్స్ వస్తుంది..దీంతో అలా వైకుంఠపురంలో లాంటి సూపర్ హిట్ సినిమాను రీమేక్ చేసి ఇక ఇప్పుడు ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఫ్రీ అనే ఆఫర్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది.

 ఇక ఇటీవల ఈ విషయాన్ని ఏకంగా హీరో కార్తీక్ ఆర్యన్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు అని చెప్పాలి. అయితే ఒక టికెట్ కొంటే మరొక టికెట్ ఫ్రీ అని బంపర్ ఆఫర్ ప్రకటించినప్పటికీ కూడా ఈ సినిమా చూసేందుకు ప్రేక్షకులు పెద్దగా థియేటర్లకు రాని పరిస్థితి నెలకొంది. దీంతో మల్టీప్లెక్స్ ల నుంచి తప్పించేసారు. ఇక మాస్ ఏరియాలలో కూడా కనెక్షన్లు ఎక్కడ కనిపించడం లేదు అని చెప్పాలి. ఇక ఈ సినిమా సూపర్ హిట్ కాకపోవడానికి అల్లు అర్జున్ స్టైల్ రిపీట్ కాకపోవడం.. త్రివిక్రమ్ మ్యాజిక్ కనిపించకపోవడం అన్నది తెలుస్తుంది. ఏదేమైనా వైకుంటపురంలో లాంటి సూపర్ హిట్ సినిమా రీమేక్ కు హిందీలో ఊహించని కష్టాలు ఏర్పడ్డాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: