పెళ్లైన తర్వాత కూడా ఆ విషయంలో తగ్గేది లేదంటున్నా స్టార్స్....!!

murali krishna
తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న హీరోయిన్స్ చాలామందే ఉన్నారు. ఇందులో కొంతమంది పెళ్లి  చేసుకొని సెటిల్ అవ్వగా ఇంకొంతమంది వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.
అలాగే వివాహమైనప్పటికీ కూడా కొంతమంది రెమ్యూనరేషన్ పరంగా ఏమాత్రం తగ్గేదే లేదంటున్నారు. వాటిని తుచ తప్పకుండ పాటిస్తున్నా వాళ్లలో  హీరోయిన్స్ నయనతార ,సమంత, కాజల్ ,హన్సిక ఇంకా కొంతమంది  హీరోయిన్లు ఉన్నారు.
వారిలో ముఖ్యంగా నయనతార రేంజ్ రోజురోజుకి పెరుగుతూనే ఉందని చెప్పవచ్చు. డైరెక్టర్ విగ్నేష్ తో వివాహం ఐనా అనంతరం తాను ఏకంగా ఒక్కో చిత్రానికి రూ .10 కోట్లు డిమాండ్ చేస్తోందట. ఐతే గతంలో ఒక్కో సినిమాకి రూ .6 కోట్ల రూపాయలు తీసుకునేదని సమాచారం.
ఇక సమంత, నాగచైతన్యల విడాకుల తర్వాత మంచి క్రేజ్ ఏర్పడింది. దీంతో సినిమాల వేగాన్ని కూడా పెంచేసింది సామ్ . ఆమె పలు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తోంది. ఈ రకంగా రెండు చేతుల సంపాదిస్తున్న సమంతా ప్రస్తుతం ఒక్కో చిత్రానికి రూ .6కోట్లు డిమాండ్ చూస్తోందనీ సమాచారం. కానీ గతంలో ఒక్క చిత్రానికి రూ .4కోట్లు తీసుకునేదని  సమాచారం.
అలాగే ఆ లిస్ట్ లో ఉన్నా ఇంకొక హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా వివాహమై ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చింది. ప్రెసెంట్  బాలకృష్ణ నటిస్తున్న 108వ సినిమాకు ఈమెను ఎంపిక చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.అందుకుగాను రూ .3 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తోందని సమాచారం. గతంలో ఒక్కో చిత్రానికి రూ .2 కోట్లు మాత్రమే అందుకునేది.
ఇకపొతే ఒకప్పుడు వరుస విజయాలతో దూసుకుపోయిన హీరోయిన్ హన్సిక టాలీవుడ్, బాలీవుడ్ ,కోలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న హీరోయిన్ హన్సిక ఇటీవల వివాహం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ ఒక చిత్రానికి రూ .2 కోట్లు డిమాండ్ చేస్తోందట.
అలాగే  కొంతమంది హీరోయిన్లకు అవకాశాలు లేకపోయినా వచ్చిన మూవీ ఒప్పుకోవాలి అంటే కొన్ని కోట్ల రూపాయలు ఆడుగుతున్నారని ఇండస్ట్రీ వర్గాలి చెప్పుకుంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: