శ్రీదేవి శోభన్ బాబు: ఎలా ఉందంటే?

Purushottham Vinay
ఇక ఈ సంవత్సరం సంక్రాంతికి ‘కళ్యాణం కమనీయం’ సినిమాతో వచ్చిన హీరో సంతోష్ శోభన్ ఈ మహాశివరాత్రి పర్వదినాన 'శ్రీదేవి శోభన్ బాబు' సినిమాతో ఆడియన్స్ ముందుకు మళ్ళీ తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వచ్చాడు. ప్రశాంత్ కుమార్ దర్శకత్వంలో గౌరీ కిషన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల నిర్మించటం జరిగింది. ఈ సినిమా ప్రేక్షకులను ఎంత వరకూ ఆకట్టుకుందో ఏ విధంగా మెప్పించిందో తెలుసుకుందాం.ఇక ఈ సినిమాలో హీరో సంతోష్ శోభన్‌ ఎప్పటిలానే తన పాత్ర పరిధి మేరకు బాగానే న్యాయం చేశాడు. హీరోయిన్ గా నటించిన గౌరి కిషన్‌ కూడా పర్లేదు. ఇక హీరోకి తల్లిగా రోహిణి ఇంకా హీరోయిన్ ఫాదర్ గా నాగబాబు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. క్లైమాక్స్ కూడా బాగానే ఉన్నా ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బోర్ గా సాగి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. నిజానికి ఫస్ట్ హాఫ్ ముగిసిన తర్వాత సెకండ్ హాఫ్ భరించే ఓపిక లేని వారు థియేటర్లలోంచి వెళ్లిపోవడం అయితే ఖాయం.


సాగతీత ధోరణిలో సాగే సన్నివేశాలనేవి ఏమాత్రం లాజిక్ లేకుండా తెగ బోర్ కొట్టిస్తాయి. అసలు ఈ ప్రశాంత్ కుమార్ దిమ్మల చెప్పిన కథలో నిర్మాతకి ఏం నచ్చిందన్నది భూతద్ధం పెట్టి వెతికినా కూడా కనపడదు.ముఖ్యంగా ప్యాష్ బ్యాక్ లో సాగే సన్నివేశాల్లో నాటకీయత భరించటం చాలా కష్టంగా ఉంటుంది.ఇక కథ అలాగే కథనాలు ఆకట్టుకునేలా లేకపోవడంతో సాంకేతిక నిపుణలు పనితనం కూడా  బోసిపోయి కనిపిస్తుంది.ఇంకా కమ్రాన్ సంగీతం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. హీరో సంతోష్ శోభన్ ఇలా దొరికిన కథలు చేసుకుంటూ పోతే త్వరలోనే కనుమరుగవటం ఖాయం. శోభన్ బాబు ఇంకా శ్రీదేవి పేర్లు ప్రచారానికి పనికి వస్తాయని పెట్టినట్లు ఉంది తప్ప వేరే ఎలాంటి ప్రత్యకత లేదు.పాపం వరుస ప్లాపుల్లో ఉన్న యంగ్ హీరో సంతోష్ శోభన్ కి ఈ సినిమాతో మళ్ళీ మరో ప్లాప్ అకౌంట్ లో చేరింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: