ఆ స్టార్ హీరోయిన్ అంటే నాకు చాలా ఇష్టమని షాకింగ్ నిజాన్ని బయటపెట్టిన రామ్ చరణ్..!?

Anilkumar
సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు చాలామంది హీరోయిన్లతో కలిసి సినిమాలు చేస్తూ ఉంటారు. అనేకమంది హీరోయిన్లతో సినిమాల్లో నటించినప్పటికీ చాలా తక్కువ మంది మాత్రమే వారికి నచ్చుతారు. ఇక అలా తన మనసు దోచిన ఒక హీరోయిన్ గురించి చెప్పాడు రామ్ చరణ్. తాజాగా రామ్ చరణ్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇక ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ మీ మొదటి క్రష్ ఎవరు అని అడుగుతుంది. దానికి సమాధానంగా రామ్ చరణ్ హాలీవుడ్ స్టార్ లేడీ జూలియా రాబట్ట్స్ అంటే నాకు చాలా ఇష్టమని చెప్పాడు. జూలియా సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తే చాలు కన్నార్పకుండా ఎంతసేపైనా అలానే చూస్తూ ఉండిపోతాను.. 

ఆమె నా మొదటి క్రష్.. ప్రీటీ ఉమెన్.. సినిమా చూశాక తనకి నేను పెద్ద ఫ్యాన్ అయిపోయాను అంటూ షాకింగ్ విషయాన్ని బయట పెట్టాడు రామ్ చరణ్ .దాంతోపాటు కేథరిన్ జటా జోన్స్ అంటే కూడా తనకి చాలా ఇష్టం అని చెప్పుకొచ్చాడు. నేను చూసిన తన మొదటి సినిమా మార్క్ ఆఫ్ జోర్ ఆ సినిమాలో తన నటన చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకే తనంటే నాకు చాలా ఇష్టం అని.. తన మనసు దోచిన హీరోయిన్ల పేర్లను బయటపెట్టాడు రామ్ చరణ్. టాలీవుడ్ బాలీవుడ్ హీరోయిన్లు కాకుండా హాలీవుడ్ భామలు అంటే రామ్ చరణ్ కి ఇష్టమని చెప్పడంతో ఈ వార్త కాస్త ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే ఇక గత సంవత్సరం వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాలోని

రామ్ చరణ్ నటన అత్యద్భుతంగా ఉంది అని అమెరికన్ నటీనటులు మరియు దర్శకులు రామ్ చరణ్ పై ప్రశంసలు కురిపించడం విశేషం. త్రిబుల్ ఆర్ సినిమాలోని నటనతో అందరి మనసులను గెలిచాడు రామ్ చరణ్. అంతే కాదు గోల్డెన్ గ్లోబ్ అందుకున్న త్రిబుల్ ఆర్ సినిమా ప్రస్తుతం ఆస్కార్ బరిలో నిలిచిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆర్చి 15 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు రాంచరణ్. శంకర్ దర్శకత్వంలో రానున్న ఈ సినిమాని దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక రాంచరణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో ఏకంగా ఐదు భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడి గా కియారాఅద్వానీ హీరోయిన్గా నటిస్తోంది....!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: