పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన జగపతిబాబు..!?

Anilkumar
దిగ్గజ దర్శకుడు మరియు నిర్మాత విబి రాజేంద్రప్రసాద్ వారసుడిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు జగపతిబాబు. తండ్రి బ్యాగ్రౌండ్ తో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికి హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు ఈయన. చాలా తక్కువ కాలంలోనే విభిన్నమైన పాత్రలో నటించి అప్పట్లో టాప్ హీరోలలో ఒకరిగా నిలిచాడు జగపతిబాబు. ముఖ్యంగా కుటుంబ కథ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా కూడా నిలిచాడు .శుభలగ్నం, ఆయనకు ఇద్దరు ,పెళ్లి పీటలు, మనోహరం ,బడ్జెట్ పద్మనాభం లాంటి అద్భుతమైన సినిమాలలో నటించాడు ఈయన.సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ప్రస్తుతం జడ్సీ స్పీడ్ లో దూసుకుపోతున్నాడు. 2014లో బయపడి శ్రీను మరియు బాలక్రిష్ణ కాంబినేషన్ లో వచ్చిన లెజెండ్ సినిమాలో నటించాడు జగపతిబాబు. ఈ సినిమాతో ఆయన జాతకం మొత్తం మారిపోయింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. 

బాలయ్య నటించిన లెజెండ్ సినిమాలో ఒక కీలకపాత్రలో నటించాడు జగపతిబాబు. ఇక ఆ సినిమాలో జగపతిబాబు పోషించిన పవర్ఫుల్ విలన్ పాత్రకు ఎంతటి గుర్తింపు లభించేందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .సినీ ఇండస్ట్రీలో విలన్ గా తండ్రిగా సపోర్టింగ్ రూల్స్ చేస్తూ ఇప్పటికి అందరినీ మెప్పిస్తున్నాడు జగపతిబాబు. తెలుగుతో పాటు తమిళ మలయాళ, హిందీ ,కన్నడ భాషల్లో కూడా ప్రస్తుతం సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు జగపతిబాబు. ఇక ఇంటర్వ్యూలో భాగంగా తన ప్రొఫెషనల్ మరియు పర్సనల్ లైఫ్ కి సంబంధించిన అనేక విషయాలను పంచుకున్నాడు.

వాటితో పాటు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి కూడా కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు .ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ రాజకీయాలలోకి వెళ్లినట్టులలో పవన్ అంటే నాకు చాలా అభిమానం అని చెప్పుకొచ్చాడు. అంతేకాదు నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం రాజకీయాలతో సంబంధం ఉన్న నటుల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే నాకు ఎంతో గౌరవం అని.. అంతేకాదు సినీ ఇండస్ట్రీలో నాకు నచ్చిన హీరో అని కూడా చెప్పుకొచ్చాడు జగపతిబాబు. అనంతరం నాకు ఇష్టమైన హీరోయిన్స్ సౌందర్య అని కూడా చెప్పాడు.. ఆయన అనంతరం విలన్ పాత్రలో నటించే హీరోయిన్లలో రమ్యకృష్ణ అంటే తనకి ఎంతో ఇష్టమని పేర్కొన్నారు... ఈ క్రమంలోనే జగపతిబాబు పవన్ కళ్యాణ్ గురించి చెప్పిన ఈ వ్యాఖ్యలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: