రెండో భర్తతో ప్రెగ్నెన్సీ గురించి క్లారిటీ ఇచ్చిన సింగర్ సునీత..!?

Anilkumar
సింగర్ సునీత అందరికీ సుపరిచితమే. 42 ఏళ్ల వయసులో రెండవ పెళ్లి చేసుకుని సంచలనం రేపింది ఈమె .2021 జనవరిలో సునీత మ్యాంగో మీడియా అధినేత బిజినెస్ మాన్ రామ్ వీరపనేని వివాహం చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. అప్పట్లో సునీత వివాహం ఎంతటి సంచలనంగా మారిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సునీతకి 20 ఏళ్ల కొడుకు ఉన్నాడు. 20 ఏళ్లు కొడుకు ఉన్నప్పటికీ రెండవ వివాహం చేసుకోవడంతో అప్పట్లో ఎంతటి అవమానాలను ఎదుర్కొందో చాలామందికి తెలిసే ఉంటుంది. అందుకే ఈమె ఎప్పటికప్పుడు విమర్శలకు గురవుతూ ఉంటుంది. సోషల్ మీడియా వేదికగా ఈమెను చాలా మంది ట్రోల్స్ చేస్తూ ఉంటారు. అయితే ఇలా తనపై ఎప్పటికప్పుడు వస్తున్న రూమర్స్ కి గాను వివరణ ఇస్తూ వస్తుంది సునీత. 

కుటుంబం పిల్లల భవిష్యత్తు కోసం ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను అని ఈ వివాహానికి ఫ్యామిలీ మెంబర్స్ అనుమతి కూడా ఉంది అని.. ఎప్పుడూ నా నిర్ణయాన్ని గౌరవించి నా కుటుంబ సభ్యుల అంగీకారంతోనే నేను ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నాను అని.. ఇన్దుకోసం నా కుటుంబ సభ్యులు మరియు నన్ను ఆదరించేవారు సపోర్ట్ చేశారు అని.. విమర్శించే వారికి క్లారిటీ ఇచ్చింది సునీత. అంతేకాదు పెళ్లి అనేది ఆమె వ్యక్తిగత వ్యవహారమని అసలు ఈ విషయం మీకెందుకు అంటూ అప్పట్లో చాలామందిపై మండిపడింది కూడా. ఇక రెండో పెళ్లి తర్వాత సునీత జీవితం పూర్తిగా మారిపోయింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా తనకున్న ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడింది సునీత. అంతే కాదు తనకున్న ఇద్దరు పిల్లల్ని కూడా సెటిల్ చేసింది ఇటీవల సునీత కొడుకు ఆకాష్ హీరోగా ఒక సినిమాని లాంచ్ చేశాడు.

ఇక ఆ సినిమాకి సునీత భర్త రామ్ నిర్మాతగా ఉన్నారు. ఇక షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ ఏడాది విడుదల కానుందని తెలుస్తోంది. సునీత కూతురు ప్రస్తుతం తల్లి బాటలోనే నడుస్తుంది .ప్రస్తుతం ప్లే బ్యాక్ సింగర్ కావాలని భావిస్తోంది సునీత కూతురు. అయితే సునీత పై వస్తున్న రూమర్లలో తను గర్భవతి అన్నది కూడా ఒక రూమర్. అయితే తాజాగా ఈ రూమర్ పై క్లారిటీ ఇచ్చింది సునీత. తాజాగా ఒక మ్యూజికల్ ఈవెంట్ ప్రమోషన్ లో పాల్గొంది. ఇక ఈ సందర్భంగా మీరు తలయ్యారంటూ జరుగుతున్న ప్రచారంపై మీ స్పందన ఏంటి అని అడగగా ఈ పుకారు నా వరకు రాలేదు.. నేను తల్లిని అయ్యాను అనేది నాకే తెలియదు.. నేను తల్లిని అయ్యాను అన్న విషయం ఈ రోమర్ క్రియేట్ చేసిన వాళ్ళకి మాత్రమే తెలుసు.. నాకు గాని నా జీవితానికి గాని ఈ విషయంతో ఎలాంటి సంబంధం లేదు అంటూ క్లారిటీ ఇచ్చింది సునీత..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: