ఎన్టీఆర్ 30, 31: ఇక నో బ్రేక్స్..?

Purushottham Vinay
ప్రస్తుతం సోషల్ మీడియా హవా బాగా పెరగడంతో హీరోల ఫ్యాన్స్ కూడా అప్ డేట్స్ విషయంలో సోషల్ మీడియాపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. తమ ఫేవరెట్ హీరోల సినిమాలకు సంబంధించి ఎలాంటి అప్ డేట్ వచ్చినా కూడా అభిమానులు క్షణాల్లో ఆ అప్ డేట్స్ ను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.అయితే ఎన్టీఆర్30 సినిమాకి సంబంధించి అప్ డేట్స్ రాకపోవడంతో కొన్నిరోజుల క్రితం ఫ్యాన్స్ శృతి మించి ప్రవర్తించారు. అయితే అమిగోస్ ఈవెంట్ లో ఎన్టీఆర్ అభిమానులకు సుతిమెత్తగా వార్నింగ్ ఇచ్చి క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే.అయితే ప్రస్తుతం ఎన్టీఆర్30 గురించి జోరుగా చర్చ జరుగుతున్నా అభిమానులు మాత్రం కొంచెం సైలెంట్ గా ఉన్నారు. ఫ్యాన్స్ సైలెంట్ కావడంతో ఎన్టీఆర్ అనుకున్నది సాధించారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.  


ఎన్టీఆర్30 మూవీ షూట్ పూజా కార్యక్రమాలు ఈ నెలలోనే జరగనుండగా హీరోయిన్ కు సంబంధించిన వివరాలను కూడా వెల్లడించారు. ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుందని కొరటాల తెలిపాడు.అయితే ఈ విషయంలో మాత్రం తారక్ అభిమానులు చాలా డల్ అయ్యారు. ఎందుకంటే జాన్వీకి యాక్టింగ్ రాదు. మనకు అవసరమా కొరటాల అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొరటాలని ట్రోల్ చేస్తున్నారు. ఇక తారక్ ఈ సినిమాతో అలాగే ప్రశాంత్ నీల్ సినిమాతో ఫుల్ బిజీగా మారబోతున్నాడు. ఇప్పటికే చాలా కాలం పాటు బ్రేక్ తీసుకోవడం వల్ల ఇక నుంచి విరామం లేకుండా తన రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్ లని పూర్తి చేసే పనిలో ఫుల్ గా బిజీ అవ్వనున్నాడు తారక్. ఇక రీసెంట్ గా ఆర్ ఆర్ ఆర్ తో ఇంటర్నేషనల్ లెవెల్ లో హిట్ అందుకున్న కారణంగా ఎన్టీఆర్ 30,31 మూవీలు దాదాపు ఒక్కొకటి 250 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: