రావణాసుర: జెట్ స్పీడులో రవితేజ?

Purushottham Vinay
రవితేజ మళ్ళీ హిట్ ట్రాక్ లోకి వచ్చేసాడు.ధమాకా మూవీతో సూపర్ హిట్ అందుకున్నాడు రవితేజ. అలాగే మెగాస్టార్ చిరంజీవితో కలిసి చేసిన వాల్తేరు వీరయ్య సినిమాతో కూడా మరో సూపర్ హిట్ అందుకున్నాడు.ఈ క్రమంలో మరో ఇంట్రెస్టింగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో అభిషేక్ పిక్చర్స్, ఆర్ టి టీమ్‌వర్క్స్‌పై తెరకెక్కుతున్న ఎంగేజింగ్ యాక్షన్ థ్రిల్లర్ 'రావణాసుర' తో ఈసారి థ్రిల్ చేయడానికి రెడీగా వున్నారు. అభిషేక్ నామా, రవితేజ ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.రవితేజ పుట్టినరోజున రావణాసుర డిఫరెంట్ షేడ్స్ చూపించే ఒక గ్లింప్స్ ని విడుదల చేయడం ద్వారా ప్రమోషన్లను స్టార్ట్ చేశారు మేకర్స్. ఈమధ్యనే హర్షవర్ధన్ రామేశ్వర్ స్వరపరిచిన థీమ్ సాంగ్‌ను విడుదల చేయడం ద్వారా మ్యూజిక్ ప్రమోషన్‌లను స్టార్ట్ చేశారు. ఎలక్ట్రిఫైయింగ్, వైబ్రెంట్ ట్రాక్ మ్యూజిక్ చార్ట్‌లలో ఇది టాప్ లో నిలిచింది. హర్షవర్ధన్ రామేశ్వర్‌తో పాటు భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకి సంగీతం అందించారు.


ఇక రెండవ సింగిల్ ప్యార్ లోన పాగల్ లిరికల్ వీడియోను ఫిబ్రవరి 18న విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ అనౌన్స్ చేశాడు. సూపర్ షేడ్స్‌తో బ్లాక్ అవుట్ ఫిట్ ధరించిన రవితేజ పోస్టర్‌లో అల్ట్రా-స్టైలిష్‌గా కనిపిస్తు గ్రేస్ ఫుల్ డ్యాన్స్ మూమెంట్ తో ఎంతగానో ఆకట్టుకున్నారు.ఇక సుధీర్ వర్మ ఈ మూవీలో రవితేజను లాయర్ పాత్రలో మునుపెన్నడూ చూడని విధంగా హై యాక్షన్‌ లో  చూపిస్తున్నారు. శ్రీకాంత్ విస్సా ఈ సినిమాకి సరికొత్త కథని అందించారు. సుధీర్ వర్మ తన మార్క్ టేకింగ్‌తో ఈ సినిమాని కథనంలో ఊహించని మలుపులతో స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా తీస్తున్నారు. సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్ ఇంకా పూజిత పొన్నాడ.. హీరోయిన్లుగా నటిస్తున్నారు. విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా శ్రీకాంత్ ఎడిటర్ గా ఈ సినిమాకి పని చేస్తున్నారు. ఏప్రిల్ 7,2023న ఈ సినిమా చాలా గ్రాండ్‌గా విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: