ఆ శాపం వల్లే.. ఉదయ్ కిరణ్ చనిపోయాడా?

praveen
సినిమా ఇండస్ట్రీ అనే రంగుల ప్రపంచంలో టాలెంట్ ఎంత ఉన్నప్పటికీ అదృష్టం కూడా కలిసి రావాలి. అయితే కొన్ని కొన్ని సార్లు టాలెంట్ అదృష్టం కలిసి వచ్చినప్పటికీ భారీ బ్యాక్ గ్రౌండ్ కూడా కావాలేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అప్పటికే ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న హీరోల నుండి పోటీని తట్టుకొని నిలబడాలి అంటే ఇక భారీ బ్యాక్ గ్రౌండ్ ఎంతో అవసరం. కానీ ఇలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగాడు హీరో ఉదయ్ కిరణ్. చిత్రం అనే సినిమా ద్వారా హీరోగా ప్రస్తానాన్ని మొదలుపెట్టి ఆ తర్వాత వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లు సాధించాడు.

 ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఇక ఇండస్ట్రీలో హవా నడిపించేది ఉదయ్ కిరణ్ అందరూ భావించారు.  కానీ ఆ తర్వాత మాత్రం ఉదయ్ కిరణ్ చేసిన సినిమాలు పెద్దగా ప్రేక్షక ఆదరణకు నోచుకోలేదు. ఈ క్రమంలోనే వరుస ప్లాపులతో సతమతమైన ఉదయ్ కిరణ్ తన దగ్గర ఉన్నదంతా సినిమాల కోసమే ఖర్చు పెట్టి చివరికి మనస్థాపంతో తన ఫ్లాట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది పెద్దలు ఉదయ్ కిరణ్ కెరియర్ను నాశనం చేశారు అంటూ అప్పట్లో ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.

 అయితే ఇప్పటికి కూడా ఉదయ్ కిరణ్ చనిపోవడానికి గల కారణం ఏంటి అన్నది మాత్రం ఎప్పుడూ హాట్ టాపిక్ గానే మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి. అయితే ఉదయ్ కిరణ్ చనిపోవడానికి ఇక అతనికి ఒక శాపం తగలడమే కారణం అని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఉదయ్ కిరణ్ ఓ సినిమా షూటింగ్లో పాల్గొన్న సమయంలో షూటింగ్ సెట్లోకి ఒక పాము వచ్చిందట. ఆ సమయంలో పామును చూసి అందరూ భయపడుతుంటే.. ఉదయ్ కిరణ్ ఒక పెద్ద కర్రతో పామును కొట్టి చంపాడట. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత కొన్ని రోజులకే ఉదయ్ కిరణ్ అర్ధాంతరంగా చనిపోయాడట. ఇక ఆయన చనిపోవడానికి పాము శాపమే కారణం అంటూ ఒక వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: