జక్కన్నపై మరో టాప్ హాలీవుడ్ డైరెక్టర్ ప్రశంసలు?

Purushottham Vinay
తెలుగు సినిమా సత్తా ఏంటో ప్రపంచవ్యాప్తంగా ఎలుగెత్తి చాటారు టాలీవుడ్ స్టార్ దర్శకుడు దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి. బాహుబలి సిరీస్ తోనే తెలుగు గురించి ప్రతిఒక్కరు మాట్లాడుకునేలా చేసిన రాజమౌళి..ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాతో టాలీవుడ్ సత్తా ఏంటో మరోసారి ప్రపంచానికి తెలిసేలా చేశారు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే..ఎన్నో రికార్డులు కొల్లగొట్టింది ఈ సినిమా. గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో కూడా సత్తా చాటింది ఈ సినిమా. ఇక లాస్‌ ఏంజిల్స్‌లో జరిగిన ప్రతిష్టాత్మక గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుల్లో అయితే నాటు నాటు పాట అవార్డ్‌ను కూడా సొంతం చేసుకుంది. బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో నాటు నాటు పాట ఏకంగా బెస్ట్‌ సాంగ్‌ అవార్డ్‌ దక్కించుకుంది. ఈ సినిమా మ్యూజిక్‌ డైరెక్టర్‌ కీరవాణి అతిరథ మహారథుల మధ్య గోల్డెన్‌ గ్లోబ్ అవార్డును అందుకున్నారు. ఇంకా అలాగే ఆస్కార్ రేస్ లోకి కూడా  ఈ పాట అడుగుపెట్టింది.


ఈమధ్య అనౌన్స్ చేసిన ఆస్కార్ నామినేషన్స్ లో నాటు నాటు పాట చోటు దక్కించుకుంది . ఈ పాటలో రామచరణ్ ఇంకా జూనియర్ ఎన్టీఆర్‌ స్టెప్పులు ఫ్యాన్స్‌ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే రాజమౌళిపై హాలీవుడ్ దర్శకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మొన్నామధ్య దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ రాజమౌళిపై పొగడ్తల వర్షం కురిపించారు. ఆర్ఆర్ఆర్ సినిమా తనకు ఎంతగానో నచ్చిందని.. మరోసారి కూడా ఈ సినిమా చూస్తా అంటూ చెప్పారు.తాజాగా మరో హాలీవుడ్ టాప్ దర్శకుడు స్టీవెన్ స్పిల్ బర్గ్ కూడా రాజమౌళి పై ప్రశంసలు కురిపించారు. దాంతో రాజమౌళి ఉబ్బి తబిపోతున్నారు.ఇక స్పిల్బర్గ్ తో రాజమౌళి ఆన్ లైన్ లో మాట్లాడటం జరిగింది. స్పిల్ బర్గ్ తన కొత్త ఫెబిల్ మెన్ రిలీజ్ సందర్భంగా ఎస్ ఎస్ రాజమౌళితో ప్రత్యేకంగా యుట్యూబ్ లో మాట్లాడారు. ఏకంగా హాలీవుడ్ టాప్ డైరెక్టర్ స్పిల్ బర్గ్ తనతో మాట్లాడతంతో రాజమౌళి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: