హీరో లేకుండానే ట్రైలర్..!!

Divya
తమిళ నటుడు విజయ్ ఆంటోనీ తెలుగు ప్రేక్షకులకు కూడా సిపరిచితమ. మొదట బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన విజయ్ ఆంటోని ఆ తర్వాత ఎన్నో చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పించారు. తన విలక్షణమైన నటనతో ఎన్నో చిత్రాలను తెరకెక్కించారు. బిచ్చగాడు సినిమా మంచి విజయం సాధించడంతో ఈ సినిమా సీక్వెల్ కోసం అభిమానులు చాలా కాలం నుంచి ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. దీంతో ఈ సినిమా ఇప్పటికీ తెరకెక్కిస్తూ ఉన్నారు విజయ్ ఆంటోని. బిచ్చగాడు-2 అనే పేరుతో ఈ సినిమాని ఆడియోస్లోకి తీసుకురావడంతో ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అంటూ అప్డేట్ కోసం కూడా ఎదురు చూస్తున్న క్రమంలోనే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి చిత్ర బృందం ఈ సినిమాని వేసవిలో విడుదల చేయబోతున్నట్లు తెలుపుతూ ఒక టీజర్ ను ట్రైలర్ను విభిన్నంగా ఉండే విధంగా ఒక స్నేక్ పిక్ ట్రైలర్ ని విడుదల చేసింది. ట్రైలర్లు చూపించిన ప్రకారం..చూస్తుంటే మనిషి మెదడుపై రీసెర్చ్ చేసే కథ అంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లుగా కనిపిస్తున్నది.. విజయ్ ఆంటోనీ ఈ సినిమాలో హీరో గానే కాకుండా డైరెక్టర్ , సంగీత దర్శకుడుగా కూడా పనిచేస్తున్నారు. హీరోయిన్గా కావ్య దాపర్ నటిస్తున్నది.

ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలో బొంబాయిలో జరుగుతున్నప్పుడు ఒక బోట్ యాక్సిడెంట్ కూడా జరగడంతో విజయ్ ఆంటోని ఆస్పత్రి పాలయ్యారు. ముఖ్యంగా అతని ఫేస్ కూడా సర్జరీ చేసే విధంగా ఉన్నట్లు వార్తలు వినిపించాయి. మరి ఏ మేరకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకుంటుందో తెలియాలి అంటే సమ్మర్ వరకు వేచి ఉండాల్సిందే.. ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ హాట్స్టార్ సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది అలాగే ఈ సినిమా తెలుగు రైడ్ సినిమా మాత్రం స్టార్ మా దక్కించుకున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: