షణ్ముఖ్ తో అలాంటి తప్పు చేసినందుకు కన్నీరు పెట్టుకున్న సిరి..!?

Anilkumar
యూట్యూబ్ సెలబ్రిటీలుగా బిగ్బాస్ సీజన్ 5 లో  షణ్ముఖ్ జస్వంత్ మరియు సిరి రావడం జరిగింది. ఇక ఆ షోలో వీరిద్దరూ ఎంతలా రొమాన్స్ చేశారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరీ రొమాన్స్ కి తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఎంతలా షాకయ్యారో మనందరికీ తెలిసిందే. ఎందుకు అంటే షణ్ముఖ్  అప్పటికే దీప్తి సునయనతో ప్రేమలో ఉన్నాడు. ఇక వారిద్దరి పెళ్ళికి ఇరువురు కుటుంబ సభ్యులు సైతం అంగీకరించారు. ఇదిలా ఉంటే మరోపక్క సిరికి కూడా బయట శ్రీహాన్ అనే వ్యక్తితో నిర్చితార్థం కూడా అయింది. ఇక అలా బయట వేరువేరు వ్యక్తులతో రిలేషన్ లో ఉన్న వీరిద్దరూ కలిసి షోలో రొమాన్స్ చేయడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు.

బిగ్ బాస్ హౌస్ లో వీరిద్దరి తీరుపై అందరూ మండిపడ్డారు. ఇక షోలో భాగంగానే సిరి వాళ్ళ అమ్మ హౌస్ లోకి రావడం జరిగింది. ఇక ఆమె హౌస్ లోకి వచ్చినప్పుడు మా అమ్మాయికి దూరంగా ఉండు అని అతని మొహం మీదే చెప్పడంతో అప్పుడు ఈ వార్త కాస్త సోషల్ మీడియా వేదికగా ఎంతగా వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అనంతరం బిగ్ బాస్ హౌస్ నుండి షణ్ముఖ్ బయటికి రాగానే దీప్తి సునైనా షణ్ముఖి బ్రేకప్ సైతం చెప్పింది.వీళ్ళిద్దరి రొమాన్స్ వారి వ్యక్తిగత జీవితాల్లో ఎంతలా ప్రభావం చూపిందో ఇక్కడే అర్థమవుతుంది. అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా ఈ ఆదివారం స్టార్ మా లో లవ్ టుడే అనే ఒక స్పెషల్ ప్రోగ్రాంలో ప్రసారం చేయనున్నారు.

ఇక ప్రోగ్రామ్ కి కొందరు ప్రేమ జంటలని పిలిచారు. ఇక వారిలో సిరి శ్రీహన్ లు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా సిరి తాను గతంలో చేసిన తప్పులను గురించి మాట్లాడుతూ శ్రీహాన్ కి క్షమాపణలు కోరడంతో ఈ ప్రోమో కాస్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. సిరి ఈ ప్రోమోలో భాగంగా మాట్లాడుతూ చిన్న చిన్న తప్పులు ఎవరైనా చేస్తారు అది ఒప్పుకోవడానికి ధైర్యం కావాలి. స్టేజ్ పైన ఒప్పుకునే దమ్ము ఉండాలి అది నాకు ఉంది నేను కూడా శ్రీహాన్ని చాలా బాధ పెట్టాను చాలా తప్పులు చేశాను అంటూ బిగ్ బాస్ లో తాను చేసిన తప్పుల గురించి మాట్లాడుతూ శ్రీహాన్ కి క్షమాపణలు చెప్పింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: