ఎన్టీఆర్ కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్న మొదటి సినిమా ఏదో తెలుసా..!?

Anilkumar
టాలీవుడ్ సిని ఇండస్ట్రీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ ని పొందాడు. దీంతో ప్రస్తుతం ఒక్క సినిమాకి గాను దగ్గర దగ్గర 100 కోట్లు తీసుకుంటున్నాడు. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ ఈ స్థాయికి వచ్చింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ ఏకంగా పాన్ వరల్డ్ స్టార్ గా కూడా నిలిచాడు. ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ ఏకంగా ఆస్కార్ అవార్డుని సైతం సొంతం చేసుకుంటాడు అని అందరూ భావిస్తున్నారు. 

ఇక ఈ సినిమాలో కొమరం భీం పాత్రలో అందరినీ ఆకట్టుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఇక అలాంటి పాన్ వరల్డ్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ రాబోయే రోజుల్లో ఒక్క సినిమాకు 100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ను తీసుకున్న ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు.ఇలాంటి హీరో ఒకప్పుడు కోటి రూపాయల లోపు రెమ్యూనరేషన్ తీసుకున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ నిన్ను చూడాలని సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. దానికంటే ముందు రెండు మూడు సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేదు. ఇక ఈ సినిమాకు చాలా తక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్.

ఈ సినిమా కంటే ముందు వేలలో రెమ్యూనరేషన్ తీసుకున్న జూనియర్ ఎన్టీఆర్ మొదటిసారి స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో లక్షల్లో రెమ్యూనరేషన్ను తీసుకున్నాడు. దాని అనంతరం సుబ్బు ఆది సినిమాలకు కూడా తక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నాడు .జూనియర్ ఎన్టీఆర్ ఆది సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఎన్టీఆర్ రేంజ్ పెరిగిపోయింది. దాని అనంతరం ఆయన నటించిన అల్లరి రాముడు, నాగ సినిమాలకి గాను కోటి రూపాయలకు పైగానే మొదటిసారి జూనియర్ ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ తీసుకున్నాడు. ఇక దాని అనంతరం సింహాద్రి సినిమా ఎప్పుడైతే బ్లాక్బస్టర్ విజయాన్ని అందుకుందో అప్పటినుండి టాలీవుడ్ స్టార్ హీరోగా రెమ్యూనరేషన్ విషయంలో టాప్ ఫైవ్ గా ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలలో అత్యధిక రెమ్యూనరేషన్  తీసుకుంటున్న హీరోలలో ఒకరిగా ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: