మనీ: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. పీఎం కిసాన్ డబ్బులపై క్లారిటీ..!

Divya
రైతుల కోసం మోడీ ప్రభుత్వం చాలా రకాల పథకాలను అందుబాటులోకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రైతుల కోసం ప్రవేశపెట్టిన పథకాలలో సీఎం కిసాన్ సన్మానం యోజన పథకం కూడా ఒకటిగా చేరింది. ఈ స్కీంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఏడాదికి 6000 చొప్పున రైతులకు అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సాయం మూడు విడతలలో రూ.2000 చొప్పున రైతులకు అందజేస్తోంది. ఇప్పటివరకు 12వ విడత డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేయగా 13వ విడత కూడా త్వరలోనే రానుంది అని స్పష్టం చేశారు.
జనవరి 28వ తేదీలోగా రైతుల ఖాతాలలో 2000 రూపాయలు జమ అవుతాయని స్పష్టం చేశారు.  కానీ కొన్ని కారణాలవల్ల వాయిదా పడుతూ వచ్చింది.  తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మార్చి 8వ తేదీన హోలీ పండుగ కంటే ముందే రైతుల ఖాతాలో 13వ విడత డబ్బులు 2000 రూపాయలు జమ అయ్యే అవకాశం ఉందని సమాచారం.  ఈ 13వ విడత సుమారుగా 11 కోట్ల మందికి అందనుంది అని సమాచారం. అయితే ఈ పథకంలో ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయి అని ఇకపోతే ఇలాంటి వాటిని నిరోధించడానికి కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు సమాచారం.
నిజానికి అర్హత లేని వారు కూడా ఈ పథకం కింద డబ్బులు పొందుతున్నారని.. అలాంటి వారిపై కేంద్ర అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నట్లు సమాచారం. అనర్హులైన వారిని గుర్తించి జాబితా నుంచి తొలగించే పనిలో కేంద్రం ఉంది.  ఇప్పటివరకు డబ్బులు పొందిన వారిని గుర్తించే ఆ డబ్బులను రికవరీ చేయడానికి కూడా చర్యలు తీసుకుంటోందని సమాచారం. ముఖ్యంగా పీఎం కిసాన్ సాయం పొందుతున్న రైతులు ఈ కేవైసీ చేసుకోవడం అనేది తప్పనిసరి కాబట్టి ఆధార్ను అనుసంధానం చేసుకొని ఈ కార్యసి చేసుకోవాలి లేదంటే 13వ విడత డబ్బులు అందవు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: