రామ్ సినిమాతో నైనా సక్సెస్ కొట్టేనా.. ప్రిన్స్..!!

Divya
డైరెక్టర్ బోయపాటి శ్రీను, హీరో రామ్ పోతినేని కాంబినేషన్లో వస్తున్న ఒక చిత్రంలో యంగ్ హీరోని విలన్ గా తీసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. గతంలో కూడా లింగు స్వామి డైరెక్షన్లో వచ్చిన మాస్ సినిమాలో నటుడు ఆది పినిశెట్టిని విలన్ గా చూపించారు. కానీ ఈ చిత్రం డిజాస్టర్ గా మిగిలింది. రామ్ కెరియర్ లోనే ది వారియర్ మూవీ భారీ డిజాస్టర్ కావడంతో తన తదుపరిచిత్రాన్ని కచ్చితంగా సక్సెస్ సాధించాలని డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తూ ఉన్నారు. బోయపాటి శ్రీను కూడా బాలయ్యతో హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారు.

రామ్ ఈసారి కూడా మాస్ మసాలా సినిమా తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే హైదరాబాదులో మొదలు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో విలన్ గా యంగ్ హీరో ప్రిన్స్ నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొదట డైరెక్టర్ తేజ దర్శకత్వంలో వచ్చిన నీకు నాకు సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు .ఆ తర్వాత ప్రిన్స్ సినిమాలో బస్ స్టాప్ సినిమాలో నేను శైలజ సినిమాలో కూడా నటించారు. దీంతో నటన పరంగా పరవాలేదు అనిపించుకున్నారు ప్రిన్స్.
ఇక బోయపాటి సినిమా లో ప్రిన్స్ పాత్ర ఈ సినిమాకు హైలైట్ గా నిలవబోతోందని తెలుస్తోంది.రాసుకున్న కథ కోసం ఇతను విలన్ గా నటించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో బోయపాటి శ్రీను కూడా జగపతిబాబు, శ్రీకాంతులను విలన్లుగా రీ  ఎంట్రీ గా పరిచయం చేయడం జరిగింది. ప్రస్తుతం జగపతిబాబు పలు చిత్రాలలో విలన్ గా నటిస్తూ మెప్పిస్తున్నారు మరి రాబోయే రోజుల్లో నటుడు ప్రిన్స్ కూడా సినిమాలలో విలన్ గా నటించి మెప్పిస్తారేమో చూడాలి మరి. మరి రామ్తో ఢీకొట్టబోయే ప్రజెంట్ ఎలా కనిపించబోతున్నారు తెలియాలి అంటే ఈ సినిమా విడుదల వరకు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: