వాల్తేరు వీరయ్య ఆల్ టైం రికార్డ్.. మెగాస్టార్ అంటే మామూలుగా ఉండదు మరీ?

praveen
మెగాస్టార్ చిరంజీవి.. ఈ సంక్రాంతికి సూపర్ హిట్ కొట్టేశాడు అన్న విషయం తెలిసిందే. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు చిరంజీవి. ఇక ఈ సినిమా ఊహించనీ రీతిలో సూపర్ డూపర్ విజయాన్ని సాధించింది అని చెప్పాలి. అభిమానులు మెగాస్టార్ చిరంజీవిని ఎలా అయితే సినిమాలో చూడాలి అనుకున్నారో.. ఇక దర్శకుడు బాబి అచ్చం అలాగే చూపించాడు. అందుకే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది అని చెప్పాలి. అయితే ఇక ఈ సినిమా మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో ఇక సంక్రాంతికి సినీ అభిమానులు అందరూ కూడా థియేటర్లకు బారులు తీరారు అని చెప్పాలి.

 ఇక 200 కోట్ల వసూళ్లు సాధించిన ఈ సినిమా మెగాస్టార్ రేంజ్ ఎక్కడ తగ్గలేదు అన్న విషయాన్ని నిరూపించింది అని చెప్పాలి. ఇంకా ఎన్నో రికార్డులు కొల్లగొడుతూనే దూసుకుపోతుంది. ఇక ఇటీవల వాల్తేరు వీరయ్య సినిమా వైజాగ్ లో మోస్ట్ ఫేమస్ సింగిల్ స్క్రీన్ అయినటువంటి జగదాంబ 70mm లో ఆల్ టైం నాన్ రాజమౌళి రికార్డును సెట్ చేసింది అని చెప్పాలి. 22 రోజుల్లో ఒక్క స్క్రీన్ నుంచే కోటి రూపాయల గ్రాస్ అందుకుంది వాల్తేరు వీరయ్య. ఇంత తక్కువ సమయంలో రాజమౌళి సినిమాలు కాకుండా ఎక్కువ వసూలు సాధించిన మొట్టమొదటి సినిమాగా ఇక వాల్తేరు వీరయ్య రికార్డు సృష్టించింది అని చెప్పాలి.

 అయితే ఇక ఈ సినిమాలో చిరంజీవి నటనతో పాటు ఇక రవితేజ కీలకపాత్రలో నటించడం కూడా సినిమాకు ఎంతో ప్లస్ పాయింట్ గా మారిపోయింది. అదే సమయంలో ఇక దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ అయితే ప్రేక్షకులందరికీ కూడా పూనకాలు తెప్పించే విధంగా ఉంది అని చెప్పాలి.  అయితే ఇక ఇప్పుడు వాల్తేరు వీరయ్య సినిమా సూపర్ డూపర్ విజయం సాధించడంతో మెగాస్టార్ నటించిన తర్వాత సినిమాలపై కూడా అభిమానుల్లో భారీగా అంచనాలు పెరిగిపోయాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: