నాని దసరా సినిమాకు డిమాండ్ మాములుగా లేదుగా...!!

murali krishna
న్యాచురల్ స్టార్ అయిన నాని ఇప్పటి వరకు క్లాస్ హీరోగా ప్రేక్షకులను మెప్పించాడు. అయితే ఇప్పుడు మాత్రం సరికొత్త మేకోవర్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి అయితే సిద్ధం అయ్యాడు
ఇప్పటి వరకు ఫ్యామిలీ ఆడియెన్స్ లో మంచి పేరు సంపాదించిన  నాని ఇకపై మాత్రం మాస్ ఆడియెన్స్ ను టార్గెట్ చేయబోతున్నాడని తెలుస్తుంది... తన తరువాత సినిమా పక్కా మాస్ ఎంటర్టైనర్ గా అయితే తెరకెక్కుతుంది.
 నాని శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ''దసరా'' సినిమా ను చేస్తున్నాడు. రా అండ్ విలేజ్ డ్రామా సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాలో నానికి జోడిగా కీర్తి సురేష్ హీరోయిన్ గా అయితే నటిస్తుంది.. ఇప్పటికే నాని పక్కా ఊర మాస్ ఇంటెన్స్ లుక్ కు సంబంధించిన పలు పోస్టర్ లను విడుదల చేసారు మేకర్స్..అన్నీ కూడా ఫ్యాన్స్ లో మంచి ఇంపాక్ట్ ను ఇచ్చాయి . అలాగే ఇటీవలే ఈ సినిమా నుండి టీజర్ కూడా విడుదల అయ్యింది.
ఈ టీజర్ వచ్చిన తర్వాత అయితే నాని ఊర మాస్ లుక్ కు ఈయన యాసకు ఇంకా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల మేకింగ్ కు ఆడియెన్స్ ఫిదా అయిపోయారు... ఒక్క చిన్న టీజర్ తో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.. న్యాచురల్ స్టార్ నాని మేకోవర్ మాత్రమే కాదు ఫుల్ బాడీ లాంగ్వేజ్ కూడా మార్చుకుని బాగా అదరగొట్టాడు.. ఇక ఈ టీజర్ ప్రభావంతో దసరా సినిమాకు ముందు కంటే మరిన్ని భారీ ఆఫర్స్ అయితే వస్తున్నాయని తెలుస్తుంది. ఇప్పటికే పలు చోట్ల థియేట్రికల్ డీల్ క్లోజ్ అవ్వగా మిగతా చోట్ల భారీ డిమాండ్ అయితే నెలకొందట.. దీంతో నాని దసరా సినిమా గట్టిగానే బిజినెస్ చేసేలా ఉందని తెలుస్తుంది... మరి ఈ సినిమాతో నాని ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి మరీ... ఇక ఈ సినిమా మార్చి 30, 2023 లో భారీ స్థాయిలో తెలుగు, తమిళ్, కన్నడ మరియు మలయాళం భాషల్లో విడుదల చేయనున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: