తారకరత్న కోసం బాలయ్య ఎంత రిస్క్ చేసాడో తెలిస్తే షాక్ అవుతారు..!?

Anilkumar
టాలీవుడ్ నట సింహం నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.సినీ రంగంలో నందమూరి బాలకృష్ణ అగ్రనటుల్లో ఒకరు. ప్రస్తుతం ఒకవైపు సినిమాలో మరోవైపు రాజకీయాలలో బిజీగా ఉన్నాడు బాలయ్య. ఎప్పుడూ షూటింగ్ మరియు రాజకీయ కార్యక్రమాలలో బిజీగా ఉంటూ ఇటు కుటుంబ సభ్యులతో కూడా గడుపుతూ ఉంటాడు బాలకృష్ణ. ప్రస్తుతం తన అన్న కొడుకు ఆసుపత్రిలో ఉన్నందుకు గాను అన్ని పనులను వదిలేసి తన అన్న కొడుకు బాధ్యతలను తానే చూసుకుంటున్నాడు. ప్రస్తుతం తన సినిమాలు బిజీ షెడ్యూల్ కి విరామమించి ఆసుపత్రికి పరిమితమయ్యాడు బాలకృష్ణ. 

ప్రస్తుతం తండ్రి తర్వాత తండ్రిగా అన్న కొడుకు బాధ్యతలను తన భుజాలపై వేసుకున్నాడు బాలకృష్ణ. ఇటీవల నారా లోకేష్ పాదయాత్రకు వెళ్లిన నందమూరి తారకరత్న గుండెపోటుకు గురైన సంగతి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఐసీయూలో బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో తారకరత్న చికిత్స తీసుకుంటున్నాడు. ఇటీవల ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని కూడా వైద్యులు తెలియజేశారు. అయితే తారకరత్నకు ఈ సంఘటన ఎదురైనప్పటినుండి తన బాబాయి నందమూరి బాలకృష్ణ ఆయనని కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ తన ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.

అయితే  అందుతున్న సమాచారం ప్రకారం కోసం బాలకృష్ణ మరో సంకల్పం తీసుకున్నారు అని తెలుస్తోంది. ఇందులో భాగంగానే బాలకృష్ణ అఖండా దీపారాధన చేపట్టారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం లో మృత్యుంజయ స్వామి ఆలయంలో అఖండ జ్యోతి దీపారాధన కొనసాగిస్తున్నారు బాలకృష్ణ. బాలకృష్ణ దీపాలను ప్రమిదల్లో కాకుండా మట్టి మరియు కంచు పాత్రలో వెలిగిస్తున్నారు. ఈ అఖండ జ్యోతి దీపారాధన దాదాపు 44 రోజులు కొనసాగింది. ఇకపోతే బాలకృష్ణ తారకరత్న ఆరోగ్యం పై తీసుకున్న శ్రద్ధ గురించి ఎంత చెప్పినా తక్కువే.తారకరత్న గుండెపోటుకి గురైన సమయం నుండి బాలకృష్ణ ఆరోగ్యం బాగా వాళ్ళని ఎంతగానో పరితపిస్తున్నారు. అన్న కొడుకు అయినప్పటికీ తన సొంత కొడుకులా కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు బాలకృష్ణ. ప్రస్తుతం బాలయ్య చేసిన ఈ పనికి బాలయ్య అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు సైతం మెచ్చుకుంటున్నారు. తారకరత్న కోసం బాలయ్య చేస్తున్న కృషి ఫలించాలని భావిస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: