రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం: అద్భుతమైన కాన్సెప్ట్ తో అలరించిన తుపాకులగూడెం!

kalpana
ఈమధ్య మంచి కంటెంట్ ఉన్న సినిమాలను చూడటానికి ఇష్టపడుతున్నారు ప్రేక్షకులు. ఎప్పుడు రొటీన్ కథ నే కాకుండా కథలో కాస్త కొత్తదనం ఉండేలా చూస్తున్నారు. అది చిన్న హీరో సినిమా అయినా సరే కథ బాగుంటే చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు అటువంటి కొత్త కాన్సెప్ట్ తో వచ్చిన మూవీ రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం. ఇప్పటివరకు ఏ సినిమాలలో నటించని నటీనటులు ఈ సినిమాతో పరిచయమయ్యారు.
ఇక ఈ సినిమాను వారధి క్రియేషన్స్ ప్రైవేట్ లిమిట్ బ్యానర్ మీద నిర్మించారు. ఈ సినిమాకు జైదీప్ విష్ణు దర్శకుడిగా పని చేశాడు. మంచి మంచి బ్లాక్ బస్టర్ సినిమాలకు సంగీతాన్ని అందించిన మణిశర్మ ఈ సినిమాకు తన సంగీతాన్ని అందించాడు. ఇందులో ప్రవీణ్ కండెలా, శ్రీకాంత్ రాథోడ్, శివరాం రెడ్డి, జయత్రి మకానా తో సహా మరి కొంతమంది నటీనటులు ఈ సినిమాతో పరిచయమయ్యారు. గతంలో ఈ సినిమా టీజర్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక అటువంటి కొత్త నటులతో ఈరోజు తెరమీదికి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో చూద్దాం.
కథ: ఈ సినిమా అడవి నేపథ్యంలో రూపొందింది. అడవిలో ఉన్న నక్సలిజం సమస్యలను తొలగించే కాన్సెప్ట్ తో వచ్చింది. ఇక నక్సలిజం సమస్యలను పూర్తిగా తొలగించడానికి ఒక పథకాన్ని చేపడుతుంది     కేంద్ర ప్రభుత్వం. ఇక నక్సలైట్లు సరెండర్ అయితే వారికి మూడు లక్షల రూపాయల డబ్బు, పోలీసు ఉద్యోగం అందిస్తామని ఆ స్కీం లో ప్రకటిస్తారు. ఇక నక్సలైట్ల పేరుతో అక్కడున్న ఏజెన్సీ ప్రాంతాల వ్యక్తులను సరెండర్ చేయటానికి ఒక బ్రోకర్ ఉంటాడు. ఇక ఈ విషయం ఏజెన్సీ దొర రాజన్నకు ఈ విషయం తెలుస్తుంది. వెంటనే ఆయన ఆ పనిని తన దగ్గర పని చేస్తున్న కుమార్ అనే వ్యక్తికి అప్పజెప్పుతాడు. ఇక బ్రోకర్ సర్కారు ఉద్యోగం ఫ్రీగా ఇవ్వలేమంటూ లక్ష రూపాయలు ఇవ్వాలని కండిషన్ పెడతాడు. దాంతో వందమంది కలిసి ఆ బ్రోకర్ కి కోటి రూపాయలు అందజేస్తారు. ఇక ఆ బ్రోకర్ అక్కడి నుంచి మిస్ అవుతాడు. దీంతో ఆ వందమంది ఏమవుతారు.. వాళ్లకు గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయా రావా.. చివరికి ఏం జరుగుతుంది అనేది మిగిలిన కథలో చూడవచ్చు.
విశ్లేషణ: బోరింగ్ అనే ఫీలింగ్ లేకుండా చూపించాడు డైరెక్టర్. ఎక్కడ కూడా కాన్సెప్ట్ మిస్ అనేది కాలేదు. నక్సలిజంల సమస్యలను అద్భుతంగా చూపించాడు. ఇక ఈ సినిమాతో అందరూ కొత్త నటులు పరిచయం కాగా ఎక్కడ కూడా తమ పాత్రలకు అన్యాయం చేసినట్లు కనిపించలేదు. చాలావరకు తమకు అనుభవం ఉన్నట్లుగా జీవించేశారు. ఇక డైరెక్టర్ ఈ సినిమాకు మంచి కథను కూడా అందించగా.. కథకు తగ్గట్టుగా పాత్రలను ఎంచుకున్నాడు. ఈ సినిమాకు మంచి సంగీతాన్ని అందించాడు మణిశర్మ. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ విధానం అంతా బాగుంది.
ప్లస్ పాయింట్స్: సినిమా కథ, నటీనటుల నటన, సంగీతం, సినిమాటోగ్రఫీ, కామెడీ.
మైనస్ పాయింట్స్: అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు సాగినట్లు అనిపించాయి.
ఈ సినిమా కథ ప్రతి ప్రేక్షకుడికి ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు. కొత్త కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాకు ఎక్కడ బోరింగ్ అనేది లేదు.
రేటింగ్: 3/5

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: