సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ని పెళ్లి చేసుకున్న స్టార్ హీరో కూతురు.. ఫోటో వైరల్..!?

Anilkumar
సింగర్ రాహుల్ సిప్లిగంజ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సింగర్ గా రాహుల్ సిప్లిగంజ్ కి ఎంత క్రేజ్ ఉందో మనందరికీ తెలిసిందే. ఇటీవల ఆయన పాడిన పాట నాటు నాటు కి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది.ఇదిలా ఉంటే ఇక సీనియర్ హీరో రాజశేఖర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అయితే ఆయన కూతుర్లు ఇద్దరు కూడా హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చారు. అయితే రాజశేఖర్ కూతురుగా శివాత్మికకు మంచి పేరు వచ్చింది.నటిగా ప్రస్తుతం బిజీగా ఉంది ఈమె. అయితే తాజాగా కృష్ణవంశీ దర్శకత్వంలో వస్తున్న రంగమార్తాండ సినిమాలో రాహుల్ సిప్లిగంజ్ మరియు శివాత్మిక కూడా నటిస్తున్నారు.

వీరితోపాటు ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ రమ్యకృష్ణ బ్రహ్మానందం అనసూయ ఆదర్శ అందరూ కూడా కొన్ని కీలక పాత్రలలో నటిస్తున్నారు. గత కొంతకాలంగా ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తూ బిజీగా ఉన్నారు వీరందరూ. చాలా రోజుల నుండి సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ఈ సినిమా మాత్రం ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఈ సినిమా రిలీజ్ కాకపోయినప్పటికీ ఈ సినిమాకి సంబంధించిన ఏవో ఒక వార్తలు సోషల్ మీడియా వేదికగా వస్తూనే ఉంటాయి. అయితే కృష్ణవంశీ దర్శకత్వంలో సినిమా వచ్చి చాలా కాలం అయింది. ఈ క్రమంలోనే ఆయననుండి చాలా కాలం తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారి అంచునాలు నెలకొన్నాయి.

ఇందులో భాగంగానే ఈ సినిమాకి సంబంధించిన ఒక ఫోటో ఇప్పుడు లీక్ అయింది. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ఇందులో పెళ్లికూతురుగా శివాత్మిక పెళ్ళికొడుకుగా రాహుల్ సిప్లిగంజ్ ఉన్నారు. అయితే ఈ ఫోటోను చూసిన వారందరూ శివాత్మిక మరియు రాహుల్ సిట్లేదని పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ రకరకాల కామెంట్లను చేస్తున్నారు.అంతేకాదు నిజంగా మీరిద్దరూ పెళ్లి చేసుకుంటే చాలా చూడముచ్చటగా ఉంటారు అంటూ తమ అభిమానులు వారి ఆశ భావాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదంతా సినిమా వరకే అయినప్పటికీ వీరిద్దరి జంట బావుండడంతో ఈ ఫోటో కాస్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: