ఆ స్టార్ నిర్మాత పడకగదిలో కోరిక తెరుస్తేనే ఆఫర్ ఇస్తా అన్నాడు..నయనతార..!?

Anilkumar
మొదట మోడల్ గా రాణిస్తున్న నయనతార 2003లో మనసి నొక్కరే అనే మలయాళ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూ రజనీకాంత్ చంద్రముఖి సినిమా తర్వాత మంచి గుర్తింపు పొందింది. దాని అనంతరం గజిని సినిమాలోని ఒక ఐటమ్ సాంగ్ తో మరింత పాపులారిటీని దక్కించుకుంది నయనతార. అనంతరం తెలుగు తమిళ భాషల్లో బిల్లా సినిమాతో మరింత క్రేజ్ ను అందుకుంది. అనంతరం నయనతార కొరియోగ్రాఫర్ మరియు డైరెక్టర్ ప్రభుదేవాతో ఉంది.  వారిద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలని భావించారు. అయితే అదే సమయంలో శ్రీ రామరాజ్యం సినిమా తన ఆఖరి సినిమా అని ప్రకటించింది నయనతార. 

ఆ సినిమా షూటింగ్ ఆఖరి రోజు ఘనంగా తనకి వీడ్కోలు కూడా తెలపడం జరిగింది. అనంతరం ప్రభుదేవాతో ప్రేమ వ్యవహారం పెళ్లి వరకు రాకపోవడంతో మళ్లీ సినిమాలో చేయడానికి రెడీ అయింది. ఇలా ఉంటే ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నయనతార మీడియాతో మాట్లాడుతూ తన కెరియర్ మొదట్లో కాస్టింగ్ అనుభవాలను గురించి మాట్లాడింది.ఇందులో భాగంగానే ఆమె మాట్లాడుతూ కెరియర్ మొదట్లో కాస్టింగ్ కౌచ్ అనుభవాలు చాలా ఎదురయ్యాయని.. కానీ అలాంటి వాటికి లొంగకుండా ధైర్యంగా నిర్మాతల ప్రపోజల్సును రిజెక్ట్ చేసానంటూ చెప్పుకొచ్చింది నయనతార. ఒక ప్రముఖ నిర్మాత నాకు భారీ ప్రాజెక్టులో ఆఫరిస్తానని చెప్పాడు..

 కానీ ఆ ఆఫర్ ఇవ్వాలంటే తన కోరికలు తీర్చాలని ప్రపోజల్ తనకు పెట్టాడనిమ్ ఆయన కోరిక వినగానే నా మతి పోయిందని.. అలాంటి కోరికలు తీర్చడం నావల్ల కాదు అని.. నిర్మాత ముఖం మీదే చెప్పి.. ఆ సినిమా ఆఫర్ నీ రిజెక్ట్ చేసాను అంటూ చెప్పుకొచ్చింది నయనతార. నా ప్రతిభతో నేను ఈ స్థాయికి ఎదిగానని.. అడ్డదారుల్లో కాదు అని.. ధైర్యంగా సినిమాలను వదులుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది నయనతార.ఈ నేపథ్యంలోనే ఆ నిర్మాత ఎవరు అని ఆరాధిస్తున్నారు.చాలామంది ఇక నయనతార సినిమాల విషయానికొస్తే ఇటీవల పృధ్విరాజ్ సుకుమారన్ తో కలిసి గోళ్ళనే సినిమా మరియు చిరంజీవితో గాడ్ ఫాదర్ దాంతోపాటు తమిళంలో కనెక్ట్ అనే సినిమాల్లో నటించింది నయనతార. ప్రస్తుతం షారుక్ ఖాన్ తో జవాన్ సినిమాలో నటిస్తూ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోంది నయనతార..!!.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: